జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ బుల్లితెర పైనే కాకుండా వెండితెర పైనా దూసుకుపోతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన ఈ అమ్మడుకి మెల్లగా అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి.గ్లామరస్,నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ అక్కడి నుంచి ముఖ్యమైన పాత్రల వైపు అడుగులు వేస్తూ వెళ్లింది అనసూయ.ఒకవైపు టీవి షోలతో పాటు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో తెలుగు తెరపై దూసుకుపోతోంది.
గతంలోనే లీడ్ రోల్ పాత్రలో నటించిన అనసూయ ఇప్పుడు అదే తరహా లేడీ ఒరియెంటెడ్ మూవీ ఒకటి చేస్తోంది. ఈ సినిమాలో అనసూయ కొత్త లుక్ లో ప్రేక్షకులను కనువిందు చేయబోతోందట.ఇప్పటి వరకు కనిపించిన అనసూయకి ఈ చిత్రంలో కనిపించబోయే అనసూయకి చాలా మార్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. కొత్త లుక్ లో కనిపించేందుకు అనసూయ కూడా బాగానే కష్టపడిందట. ఇక ఈ మూవీ తర్వాత అభిమానుల్లో అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు.
ఆర్వీ రెడ్డి , మారం రెడ్డి శేషు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక మూవీలో సీనియర్ నటుడు సాయి కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యిందని, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని దర్శకుడు జయ శంకర్ పేర్కొన్నారు.హీరోయిన్ ఒరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘అరి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక సినిమాలో అనసూయ లుక్ చాలా కొత్తగా ఉంటుందని, అనసూయ పాత్ర చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోందని ఆయన తెలిపారు. మరి అనసూయ కొత్త లుక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.