ఏపీలో జగన్ రెడ్డి నిర్ణయాలు.., పాలన విధానాలకు ప్రజా జీవితమే కాదు.. పరిశ్రమల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రంగాలకు గ్రహణం పట్టింది. ముందు చూపు లేకపోవడం.., దార్శినిక విధానాలను అవలంభించకపోవడం వంటివి పరిశ్రమలకు ఊరితాళ్ళు మాదిగా దాపురించాయి. తాజా జగన్ ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడే ఆయన చేతగానితనం.., సిగ్గుమాలిన చర్యకు అద్దం పడుతోంది. దేశంలో ఎన్నడూ.. ఎక్కడ లేని విధంగా ఏపీలో మాత్రమే సెప్టెంబర్ మాసంలో పవర్ హాలిడే ప్రకటించిన ఏకైన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డేనని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం జగన్ ఇస్తున్న షాక్ లకు ఇందన రంగ నిపుణులు.., పారిశ్రామికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.
ఇదే పరిస్ధితి దశాబ్ధ కాలం వెనుకకుపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. 2012 ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు. ఆ తరువాత ఆ పరిస్ధితి విభజిత తెలంగాణ.., ఏపీలో లేదు. అయితే జగన్ పుణ్యమాంటూ మరోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ఆనాటి విద్యుత్ క్లిష్ట పరిస్ధితులను పరిశ్రమలు ఎదుర్కొవాల్సి వస్తోంది. థర్మల్.., హైడ్రో.., విండ్.., సోలర్ వంటి అనేక మార్గాల్లో విద్యుత్ ను ఉత్పత్తి చేసి.. పరిశ్రమలకు అందించాల్సిన ప్రభుత్వం ఆ గురుతర బాధ్యతను మరిచింది. సెప్టెంబర్ నెలలో ప్రకటించిన పవర్ హాలిడే తో చిన్న.., మధ్యతరహా పరిశ్రమలు ఇక దివాలు తీయాల్సిందేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా ఏపీ అన్నీ రంగాలు కుదిలేయ్యాయి. చిన్న, మధ్య.., భారీ తరహా పరిశ్రమలన్నీ తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నష్టాల్లో బాటలో అన్నీ రంగాలు డౌన్ ఫాల్ ను చూస్తున్నాయి. ఈ నష్టాలకు తోడూ.. జగన్ రెడ్డి ప్రకటించిన పవర్ హాలిడే పారిశ్రామివేత్తలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శనివారం నాటికి రెండు డిస్కం ల పరిధిలో కలిపి సగటున 4 గంటల చిల్లర సమయం విద్యుత్ సరఫరా ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.ఇంకా అవసరమనుకుంటే ప్రభుత్వం.., ఏపీఈఆర్ సీ అనుమతి తీసుకుని ఇంకా సరఫరాలో మరింత కోత విధిస్తామని వెల్లడించాయి ఇందన రంగ సంస్థలు. శనివారం నాటికి ఈపీడీసీఎల్ పరిధిలో 4 గంటలు.., ఎస్పీడీసీఎల్ పరిధిలో 3 గంటలకు చొప్పున మొత్తం 8 గంటలకు పైగా విద్యుత్ సరాఫరా నిలిపివేయనున్నట్లు డిస్కంలు ప్రకటించాయి. సాధారణంగా లోడ్ రిలిఫ్ కింద ఏప్రిల్ .., మే నెలలో పవర్ హాలిడే ప్రకటిస్తారు. కానీ సెప్టెంబర్ నెలలో ఇలాంటి విద్యుత్ సంక్షోభం తలెత్తడం ఈ దశాబ్ధ కాలంలో ఇదే ప్రప్రథమం.
మరోవైపు బొగ్గునిల్వలు కూడా తగ్గుముఖం పట్టి…థర్మల్ పవర్ ఉత్పత్తికి విఘాతంగా మారునున్నది. రాష్ట్రంలో శనివారం నాటిని 198.260 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండగా.. 240.134 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. మరోవైపు సోలార్, పవన్ విద్యుదుత్పత్తి ఘోరంగా పడిపోయాయి. మరో వైపు థర్మల్ విద్యుత్తు 72.329 యూనిట్లకు గాను 65.806 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అవుతోంది. వీటిపీఎస్ లో రోజుకు సగటున 28,500 టన్నుల బొగ్గు అవసరం. ఈ యూనిట్ లో ప్రస్తుతం 73,786 యూనిట్ల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ఇది దాదాపు మూడు రోజులకు మాత్రమే సరిపోతోంది. మరోవైపు ఆర్ టీపీపీలో రోజుకు 21,000 టన్నుల బొగ్గు అవసరం ఉండగా.. కేవలం 35,495 టన్నుల మాత్రమే నిల్వ ఉంది. అలానే కృష్ణపట్నంలో రోజుకు 19,000 టన్నుల బొగ్గు అవసరం కాగా.. 2 లక్షల 34 వేల 750 టన్నుల మేరకే నిల్వలు అందుబాటులో ఉంది. అయితే బొగ్గు నిల్వలపై తగ్గుముఖం పడితే ఇంకా విద్యుత్ కోతలు ఇంకా అధికమవడం ఖాయమంటున్నారు నిపుణులు. మరోవైపు ఇందన రంగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014-19 మధ్యలో విద్యుత్ ట్రూఆప్ చార్జీల పేరిట దాదాపు 3 వేల 200 కోట్లు వసూల్ చేసినా.. ఇంకా ఎందుకు ఇంధన సంస్థలు నష్టాల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు.., ఆర్ధిక సంస్థలు తీసుకున్న రుణాలు.., ట్రాన్స్ ఫార్మర్ లు, స్మార్ట్ మీటర్లకు కోసం చేసిన అప్పుల వివరాలను కూడా ఏపీఈఆర్సీ బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ఇలానే విద్యుత్ సరఫరా విషయంలో జగన్ రెడ్డి ఒంటెద్దు పొకడ విధానాలను అనుసరిస్తే.. మరిన్నీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్ళక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.