ఏ సినిమా, ఏ హీరోకి.. ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే.. ఏ సినిమాను ఏ హీరోలు మిస్సవుతారో కూడా తెలియదు. అలా మిస్సయిన సినిమా వేరే హీరో చేతుల్లో పడి బ్లాక్ బస్టర్ అయితే.. ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామే అనే ఫీలింగ్ ఆ హీరోకి తప్పకుండా ఉంటుంది. అలా ఇప్పటికీ ఫీలవుతున్న ఆ హీరో రామ్ పోతినేని. ఆ సినిమా‘ రాజా ది గ్రేట్’.
అప్పట్లో అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ కథ ను ముందుగా రామ్ కే వినిపించాడట. అయితే అందులో హీరో అంధుడు కాబట్టి.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహంతో .. ఆ మూవీని అప్పుడు మిస్ చేసుకున్నాడట. ఆ సినిమా రవితేజ తో తెరకెక్కి ఏ రేంజ్ హిట్టయిందో తెలిసిందే. ఫామ్ లో లేని రవితేజకి లైఫ్ ఇచ్చింది ‘రాజా ది గ్రేట్’.
త్వరలోనే రామ్ తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎఫ్ 3 తర్వాత సాయిపల్లవి ప్రధాన పాత్రలో అనిల్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడట. ఆ మూవీ తర్వాత రామ్ పోతినేని సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కనుందట. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వురు తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిల్ .. టాప్ హీరోల వెంట పడి టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. ఇలా దొరికిన హీరోలతో సినిమాలు చేసుకుంటూ డైరెక్టర్ గా సత్తా చాటుకుంటున్నాడు. మరి రామ్ తో అనిల్.. ఏ తరహా సినిమా వర్కవుట్ చేస్తాడో చూడాలి.











