బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, స్టార్ హీరో రణబీర్ కపూర్ కలిసి ఒక సినిమా చేయనున్నారని బాలీవుడ్ లో ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్త నిజమని తేలిపోయింది. అవును వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రానికి ‘కబీర్ సింగ్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ కపూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
2021వ సంవత్సరం మే నెలలో సినిమా మొదలవుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను కూడా తన అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఇందులో అనిల్ కపూర్, రణబీర్ కపూర్ తో పాటుగా బాబీ డియోల్, మరియు పరిణీతి చోప్రా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘యానిమల్’ అనే పేరును ఖరారు చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక కథ విషయానికి వస్తే ఇదొక వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న స్టోరీ అని తెలుస్తోంది.
తండ్రి, కొడుకు, పూర్వ జన్మ అనే అంశాల చుట్టూ తిరిగే కథ ఇదని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసుకున్నాడని, ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి రణబీర్ కపూర్ చాలా కాలం క్రితమే ఓకే చెప్పినా, అనిల్ కపూర్ మాత్రం వారం రోజులు క్రితం నటించడానికి ఒప్పుకున్నారు. ఇక ‘యానిమల్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం సందీప్ రెడ్డి వంగా. తను తీసిన ”కబీర్ సింగ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఇది రీమేక్. తెలుగులో కూడా ‘అర్జున్ రెడ్డి’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ‘యానిమల్’ చిత్రాన్ని భద్రాకళి పిక్చర్స్ ప్రొడక్షన్ పతాకంపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని కలిసి నిర్మించనున్నారు.
Oh boy! The new year just gets better with this whistle!😉
Presenting, #Animal, can't wait for our journey to begin.#RanbirKapoor @ParineetiChopra @thedeol @imvangasandeep @VangaPranay #BhushanKumar #KrishanKumar @MuradKhetani #TSeriesFilms pic.twitter.com/AHPoGFVGSn— Anil Kapoor (@AnilKapoor) December 31, 2020











