కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మధుర క్షణాలతో పాటు, చెడు జ్ఞాపకాలను తలుచుకుంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికాం. సామాన్య ప్రజల నుండి పెద్ద సెలబ్రెటీల వరకు కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వగతం పలికారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ భారీ ఎత్తున న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అందులో అనన్య పాండే ఒకరు. ఆమె తన సహనటుడు, స్నేహితుడు అయిన ఇషాన్ ఖట్టర్ తో కలిసి మాల్దీవుల్లో కొత్త సంవత్సర వేడుకులను జరుపుకున్నారు.
వీరిద్దరూ ‘ఖాలీ పీలీ’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండి మంచి స్నేహితులుగా మారిపోయారు. అనన్య, ఖట్టర్ ఎంతో ఉత్సాహంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు అనన్య. ఆమె ఫోటోలలో శరీరానికి తగ్గరీతిలోనే రంగు రంగుల బాడీకాన్ దుస్తులు ధరించారు. మెడలో తెలుపు రంగు ముత్యాల హారం, కాళ్ళకి నలుపు రంగు హై హీల్స్ వేసుకొని అద్భుతంగా కనిపించింది.
ఫొటోలతో పాటుగా అనన్య మంచి మాటలను కూడా పోస్ట్ చేసి 2021 సంవత్సరాన్ని ఆహ్వానించారు. ‘మాకు ఒక చక్కని పాఠాన్ని, ప్రేమను, శాంతిని అందించినందుకు 2020 సంవత్సరానికి కృతఙ్ఞతలు. మీ అందరికి 2021 సంవత్సరంలో మంచి ఆరోగ్యం, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు అనన్య. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు అనన్యకు న్యూ ఇయర్ విషెస్ చెపుతున్నారు. కొత్త సంవత్సరంలో ఆమెకు అంతా మంచే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనన్య ప్రస్తుతం మన తెలుగులో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.