తిరుమల..దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం. రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో తిరుమలలో బస దొరకడం ఓ పెద్ద ప్రహసనం. ఎందుకంటే కొండమీద అకామిడేషన్‌కు డిమాండ్ ఎక్కువ. అందులోనూ స్పెషల్ గెస్ట్‌హౌస్, కాటేజీల విషయం చెప్పక్కర్లేదు. ఐతే గత జగన్ ఐదేళ్ల పాలనలో ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఏడుకొండలవాడి సొమ్మును భారీ ఎత్తున బొక్కేశారు. దళారులు, సిబ్బంది కలిసి చేసిన అవినీతి దందా తాజాగా బయటపడింది. గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థంగా వినియోగించడంపై అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది.
గడిచిన ఐదేళ్లలో తిరుమల కొండపై యథేచ్చగా అవినీతి సాగింది. తిరుమల విశిష్టతను జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా దెబ్బతీసింది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా వెనకేసుకునేందుకు నేతలు, కొంతమంది సిబ్బంది ప్లాన్ చేశారు. తిరుమలలో నాటి వైసీపీ మంత్రులు, పెద్దలు అడ్డగోలు దర్శనాలకు అనుమతులివ్వగా దళారులు, సిబ్బంది గదుల స్కామ్‌కు తెరలేపి జేబులు నింపుకున్నారు. ఐదేళ్ల పాటు అడ్డూ అదుపులేకుండా ఈ అవినీతి దందా కొనసాగింది.
తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు నిత్యం బుక్ అవుతున్నా..ఆ స్థాయిలో ఆదాయం మాత్రం రావడం లేదు. ఎందుకంటే డోనస్ స్కీమ్ కింద రూమ్‌లు బుక్ అయినట్లు రిజిస్టర్‌లో రాసేస్తున్నారు. దీనికి లెక్కాపత్రం లేకుండా పోయింది. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి పెట్టడంతో..అసలు విషయం బయటపడింది. దాదాపు 200కుపైగా కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లను దాతల పేరుతో బుక్ చేసి, ఇతర భక్తులకు అద్దెకు ఇచ్చుకున్నట్లు తేలింది.
ఐదేళ్లపాటు అప్రతిహాతంగా సాగిన ఈ అవినీతి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. తిరుమల కొండ మొత్తం ఆ తిరుమలేశుడిదే. అక్కడ ప్రైవేట్ ఆస్తులు ఉండవు. ఐతే నిత్యం వచ్చే వేలాది భక్తులకు టీటీడీ వసతి కల్పించలేదు కాబట్టి..దాతల నుంచి డోనర్ స్కీమ్ ద్వారా విరాళాలు సేకరిస్తుంటుంది. ఈ విరాళాల ద్వారా కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తుంటారు. ఖర్చు దాతలదే ఐనప్పటికీ..కాటేజీలు టీటీడీకే సొంతం. కాటేజీల నిర్వహణ, బుకింగ్ వ్యవహారాలను టీటీడీయే చూసుకుంటుంది. మొదట్లో ఏడాదిలో 60 రోజుల పాటు విరాళం ఇచ్చిన దాతలకు గానీ, వారు సూచించిన వారికి గానీ ఫ్రీగా వసతి కల్పించేవారు. ఐతే రానూరానూ దీనిని 30 రోజులకు కుదించారు. ఇక గెస్ట్‌హౌస్‌ల కోసం విరాళం ఇచ్చిన వారికి ఏటా 3 రోజులు మాత్రమే ఉచితంగా కేటాయిస్తారు. వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా కల్పిస్తారు. ఐతే ఇది జీవితాంతం ఉండే వెసులుబాటు కాదు. 20 ఏళ్లు మాత్రమే దాతలకు ఈ సౌకర్యం ఉంటుంది. ఐతే సంస్థల పేరిట విరాళ ఇస్తే 25 ఏళ్ల పాటు ఈ సౌకర్యం కల్పిస్తారు. ఆ తర్వాత కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా టీటీడీ తీసేసుకుంటుంది. ఒకవేళ దాత మరణిస్తే ఉచిత సదుపాయం కూడా ఆగిపోతుంది.











