స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. బన్నీ, సుక్కు ఇద్దరికీ ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీలో ఎంత వరకు మెప్పిస్తుంది.? బాక్సాఫీస్ దగ్గర ఏ స్ధాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. పుష్ప సినిమా తెలుగులో కన్నా హిందీ మార్కెట్ లో మంచి విజయం సాధించింది. అక్కడ 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
హిందీ మార్కెట్లో పట్టు కావాలని ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు హీరో అల్లు అర్జున్. ఆంధ్రాలో సినిమా నష్టాలు చూసినా… తాను కోరుకున్న హిందీలో వర్కౌట్ అయిందని బన్నీ హ్యాపీగా ఉన్నాడు. అందుకనే పుష్ప పార్ట్ 2ను ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నుంచి పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప పార్ట్ 2లో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే.. దర్శకుడు సుకుమార్ మాత్రం అలాంటిది లేదని చెబుతున్నారు. కొన్ని కొత్త పాత్రలు మాత్రం యాడ్ అవుతాయి అంటున్నారు. హీరో అల్లు అర్జున్, రష్మిక మధ్య ట్రాక్ రెండో భాగంలో కూడా ఉంటుందని.. భార్యాభర్తల మధ్య ఉండే సరసం ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇక ఐటం సాంగ్ కూడా ఉంటుందట. ఈసారి సమంతతో కాకుండా మరో హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించనున్నారని టాక్. మరి.. పుష్ప పార్ట్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.











