మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలను తక్కువ గ్యాప్ లో పట్టాలఎక్కించిన ఆయన మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేశారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేశ్ ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆ మూవీకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.అయితే ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ .. చిత్రాల తర్వాత ‘భోళా శంకర్’ సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు.కానీ అందరి ఆలోచనలకు భిన్నంగా చిరు ఈ మూవీ షూటింగ్ కి ఓకే చెప్పేశారు.
తమిళ చిత్రం “వేదాళం” సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం రూపొందబోతోంది.ఇటీవల ‘భోళా శంకర్’కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 21వ తేదీ నుంచి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో చిరంజీవి సహా పలువురు ఆర్టిస్ట్ లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయట.
ఇక “భోళా శంకర్” లో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా కనువిందు చేయనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీని 2022 చివరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.