ప్రభుత్వ జీవోను కొట్టేసిన హైకోర్టు .. !
ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ ఇచ్చిన జీవోను మంగళవారం హైకోర్టు సస్పెండ్ చేస్తూ .. పాత విధానంలోనే టిక్కెట్ల రేట్లు నిర్ణయించేందుకు థియేటర్ యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. థియేటర్ల యాజమాన్యాల తరుపున సీనియర్ న్యాయవాధి ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ హైకోర్టుకు వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టిక్కెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల మాజమన్యాలకు ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్ తరుపున వాదనలతో హైకోర్టు ఏకీభవించి, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్టిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపి హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.
Must Read ;- హైకోర్టు నిర్ణయంతో సినిమాల నెత్తిమీద ‘పుష్ఫ’ వర్షం











