ఉన్నమాటంటే ఉలుకేందుకో ..!
జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర అనుమతులతో అప్పులు చేయడం జీతాలు, పథకాలకు నిధులు అందజేయడం వాస్తవంకాదా? అని ఏపి ప్రజలే విమర్శిస్తున్నారు! తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటే తప్పేముంది అని పలువురు సమర్థిస్తున్నారు కూడా. పథకాలు అమలు కావాలంటే అప్పుకు వెళ్లాల్సింది. అప్పు పుట్టాలంటే కేంద్ర దయ దాక్షిణ్యం కావాల్సిందే. రాష్ట్ర ఆస్తులను హోల్‌సెల్ గా తనఖా పెట్టి పథకాలను నడినపిస్తున్నారన్నది ఓపెన్ సీక్రేట్ గా. ఇదిలా ఉంటే కేంద్రం ధాన్యం కోనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ లో బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులను చిన్నచూపు చూస్తున్న కేంద్రంపై, కేంద్రం మాటాలకు తలుపే ఏపి ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం వత్తిడితోనే ఏపీలో రైతుల మోటర్లుకు మీటర్లు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు అడుక్కుతింటున్నారని అప్పటి మంత్రులు, నేతలు అన్నారని గుర్తు చేశారు. అయితే నేడు ఏపీలో జగన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వం కేంద్ర వద్ద అడుక్కునే పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో మోటర్లకు మీటర్లు వచ్చాయని, ఆ పరిస్థితి తెలంగాణలో లేదని చెప్పారు. తెలంగాణలో రైతు మోటర్లకు విద్యుత్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టబోమని చెప్పారు. ఇది మంత్రి చేసిన కామెంట్. ఇది ఏపీ లో జరుగుతున్న తంతేగా! మరి మంత్రులు, సజ్జల ఎందుకు అంత ఉలికిపడి విమర్శలకు దిగుతున్నారో అర్థంకావడంలేదు. గతంలో కూడా పోతిరెడ్డిపాడు నీటి గురించి, ఆంధ్ర ప్రజలు గురించి నోరుపారేసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాల గట్టి కౌంటర్లే ఇచ్చిన సంగతి విదితమే.
ఏపీని, ప్రజలను కించపర్చిలే మాట్లాడితే ఊరుకోం!
ఆంధ్రుల కష్టార్జితాన్ని బిక్షమెత్తింది తెలంగాణ వారు కాదా? అని అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ఆయన ఖండించారు. హైదరాబాద్ సంపదను ప్రాంతీయ వాదం పేరుతో కొల్లగొట్టారని, లక్ష కోట్ల సంపద కలిగిన హైదదాబాద్ ను కబ్జా చేశారని గుర్తు చేశారు. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలను, విభజన ఆస్తులను ఇవ్వడం చేతగాని టీఆర్ఎస్ నాయకులకు ఏపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అయితే హూజూరాబాద్ ఎన్నికల్లో పరాజయం నాటినుంచి టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలను గుప్పిస్తునే ఉంది. కానీ ఈ క్రమంలో ఏపీని లాగి విమర్శలు చేయడం పద్దతికాదని మండిపడుతున్నారు. ఏపీ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Must Read ;- ‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!











