ముహూర్తం ఫిక్స్@కావలి ఎట్ 12 పీఎం!
అమరాతిని పరిరక్షించేందుకు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’మహా పాదయాత్రను సంకల్పించింది అమరావతి జేఏసీ. రాజధాని తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చి సంఘీభావం తెలుపుతున్నాయి. కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ .. ముందుకు సాగుతున్నాయి. 34 వేల ఏకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయంపై తొలినుంచే అన్ని వైసీపీ మినహ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. 21వ రోజు నెల్లూర జిల్లా రైతుల పాదయాత్ర కొనసాగనున్నది. వర్షాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతోంది మహాపాదయాత్ర. రైతు పాదయాత్రకు కాషాయ దళం కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు కావాలి ప్రధాన కూడలిలో రైతులను కలిసి తమ పూర్తి మద్దతును తెలపనున్నది బీజేపీ.
బాస్ ఆదేశాలతో శ్రేణులు సమాయక్తం!
నవంబర్ 14న ఏపీలో తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గం భేటి అయింది. ఈ భేటి లో అమిత్ షా ఏపీ జరుగుతున్న అనేక సంఘటనలపై స్పందించి, కేడర్ కు దిశ నిర్ధేశం చేశారు. అంతేకాక రైతు పాదయాత్రపై కాషాయ శ్రేణులకు ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. పాదయాత్రలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలపడమేకాక, తిరుపతి వరకు ఉన్న బీజేపీ శ్రేణులను పాదయాత్రకు అన్నివిధాలా సూచనలు, సలహాలు, తగిన సాయం అందించాలని సూచించారు. అమిత్ షా క్లారిటీతో బీజేపీ ఏపీ బాస్ సోము వీర్రాజు ఏపీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. దీంతో కార్యోన్ముఖులైన కాషాయ దండు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు జిల్లా కావాలిలో జరుగుతున్న రైతు పాదయాత్రలో పాల్గొనేందుకు సమయక్తమయ్యింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అధ్యక్షతన పార్టీ కేడర్ కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి తోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొగనున్నట్లు వెల్లడించారు. అలానే నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని బీజేపీ ప్రముఖులు, కేడర్ ఈ పాదయాత్రలో పాల్గొని రైతులను ముందుకు నడిపించేందుకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని సోము ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైతు మహాపాదయాత్రకు టీడీపీ తోపాటు కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు, దళిత సంఘాల మద్దతును తెలిపి, పాదయాత్రలో ఏరియాల వైజ్ గా పాల్గొంటుండగా.. నేడు బీజేపీ శ్రేణులు కూడా పాదయాత్రకు మద్దతు ప్రకటించనున్నడంతో రైతులకు అదనపు శక్తి చేకూరింది.











