ఏదైనా భారీ కార్యక్రమం సక్సెస్ చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందంటూ గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆ మాటను మరోసారి నిజం చేశారు చంద్రబాబు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డులకెక్కెలా నిర్వహించారు. నెల రోజుల ముందు నుంచే ప్రణాళికలు రచించారు. పద్ధతిగా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచుతూ స్వయంగా ప్రజలే భాగస్వామ్యం అయ్యేలా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దాదాపు రెండున్నర కోట్ల మంది యోగాలో భాగమయ్యారంటేనే సక్సెస్ రేటు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. స్థానికంగా 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును (1.47 లక్షల మంది) విశాఖ బ్రేక్ చేసింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు
యోగా..ప్రపంచానికి భారత్ అందించిన వారసత్వ సంపద. ఆధునిక జీవన కాలంలో యోగా చాలా అవసరం. ఐతే ఈ సారి యోగా కార్యక్రమాన్ని నిర్వహబించే అదృష్టం విశాఖకు దక్కింది. ఈ అవకాశాన్ని చంద్రబాబు సక్సెస్‌ఫుల్‌గా వినియోగించుకున్నారు. ప్రజలందరూ యోగాలో భాగమయ్యేలా ప్లాన్ చేశారు. యోగాంధ్రకు రూపకల్పన చేసి ప్రజల్లో నెల రోజుల ముందు నుంచే అవగాహన పెంచారు. వారందరూ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా చేశారు. యోగాలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రిజిస్టర్ చేసుకున్నవారే.
విశాఖ యోగాంధ్ర సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలు చంద్రబాబు ప్లాన్..మరొకటి నారా లోకేష్ పర్యవేక్షణ. ఇరువురి నాయకత్వంలో యోగాడే సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా సామాన్యుల్లోనూ యోగాపై అవగాహన పెరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి..నారా లోకేష్ చాలా కృషి చేశారు. టీమ్ వర్క్‌తో యోగాంధ్ర ప్రపంచ రికార్డు నమోదు చేసింది.