ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నిరర్థక,నిరుపయోగంగా ఉన్నఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ డెయిరీకి అతి తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సంగం డెయిరీ ఆస్తుల లీజు వ్యవహారం హైకోర్టులో కేసు నడుస్తుండగానే,ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్‌కు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం అక్రమమని ప్రతిపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారు.
నిరర్థక ఆస్తులేనట
ఏపీ డెయిరీ ఫెడరేషన్‌కు చెందిన వృధాగా పడిఉన్న ఆస్తులను అమూల్‌కు నామమాత్రపు ఫీజులో లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ పాల సహకార సంస్థలోని ఆస్తులను ఉత్పత్తి ఆధారంగా అమూల్‌కు లీజుకు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.దీనిపై పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read ;- సంగం డెయిరీపై ప్రభుత్వ జీవోను కొట్టివేసిన హైకోర్టు











