అందమైన గ్లామర్ డాల్స్ ను ఏరికోరి ఎన్నుకోవడం.. రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ. ఎక్కడ ఎలాంటి అందాల ముద్దగుమ్మలున్నా.. ఆయన సిక్త్ సెన్స్ ఇట్టే పసిగట్టేస్తుంది. నాటి ఊర్మిళా నుంచి మొదలు కొని.. నేటి అప్సరారాణి, శ్రీరాపాక వరకూ ఆయన పరిచయం చేసిన బ్యూటీస్ .. తెలుగు ప్రేక్షకుల్ని తమ సెన్సువల్ లుక్స్ తో కట్టి పడేస్తున్నారు. అలాంటి ఓ సరికొత్త ముద్దుగుమ్మ.. దక్షి గుత్తికొండ.
లాస్ట్ ఇయర్ ‘కరోనా వైరస్’ అనే సినిమాతో వర్మ ఆమెను తెరకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆయన .. అమ్మడి హాట్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉన్నాడు. అప్పటి నుంచి ఆమె వైరల్ అవుతునే ఉంది. రకరకాల పోజులతో నెటిజెన్స్ ను ఊపిరాడనివ్వడం లేదు. లేటెస్ట్ గా ఇన్ స్టా లో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ తో అయితే.. తెగ హీటు పుట్టిస్తోంది దక్షి.
విజయవాడ నుంచి మోడలింగ్ రంగంలోకి దిగిన దక్షి గుత్తికొండ.. వర్మ కంట్లో పడింది. ఎక్కడ అందం కనిపించినా.. అక్కడ వాలిపోయే వర్మకి .. అమ్మడ్ని కూడా తన సినిమాల్లో గ్లామర్ డాల్స్ గా ఎలివేట్ చేయడం పెద్ద కష్టం కాలేదు. వర్మ తదుపరి చిత్రాల్లో దక్షి తరచుగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే.. ఆమె అందాలకు ఇతర దర్శక, నిర్మాతలు ఆకర్షితులవుతారనడంలోనూ ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం దక్షి గుత్తికొండకు ఏ రేంజ్ లో ఆఫర్స్ వస్తాయో.
Must Read ;- గ్లామర్ అక్కర్లేదు.. మంచి క్యారెక్టర్ ఇవ్వండి చాలు