ఖజానాను ఒట్టిపోనిచ్చి .. దర్జాగా జేబులు నింపుకుని!
ఎన్నికల హామీలో సంపూర్ణ మద్యపాన నిషేదం అన్న నినాదం ఎత్తుకున్నాడు జగన్. అందురూ చాలా భేష్ అన్నారు. మహిళా ఓటు బ్యాంకును క్యాష్ చేసుకున్నాడు. పెద్దఎత్తున ఓట్లేసి గెలిపించారు. గద్దెనెక్కిన తరువాత దఫాల వారీగా నిషేదం విధిస్తానని మాట మార్చాడు. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మి.. ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. చివరికి ఓల్డ్ మద్యం బ్రాండ్లును బ్యాన్ చేసి.. వాటి స్థానంలో బూమ్ .. బుష్ .. ప్రెసిడెండ్ మెడల్ అని పేర్లు పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా అమాంతం ధరలు పెంచి మందుబాబు జేబుకు చిల్లులు పెట్టాడు. గడిచిన రెండేళ్లల్లో మద్యం పై ఏపీ ప్రభుత్వ వేలకోట్ల ఆదాయాన్ని చేజేతురాల వదిలేసుకుంది. ధరల వ్యత్యాసం, రెగ్యూలర్ బ్రాండ్లు దొరకపోవడంతో మందుబాబులు తెలంగాణ మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పునా, రెండేళ్లల్లో దాదాపు రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం కృష్ణనది పాలు చేసిందని సర్వే చెబుతోంది. అడ్డగోలు బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని, వాటాలు వేసుకుని మరి జేబులు నింపుకున్నారని అధికారపార్టీపై ఆరోపణలు.
మనొడి విధానాలు .. పక్కరాష్ట్రాలకు వరాలు!
ఏపీలో మద్యంపై స్వార్థపూరిత విధానాలు,పేరాశ వెరసి ఒకస్థాయి ఏపీ ఖజానా ఆదాయాన్ని కొల్పొయింది. అదే ఆదాయం ఉంటే అప్పుల కోసం తనఖాలు, పరువు తాకట్టు వంటివి ఉండేవి కాదుకదా అని విశ్లేషకులు వాపోతున్నారు. జగన్ రెడ్డి అనాలోచిత మద్యంపాలసీ విధానాల వలన మద్యం ఆదాయం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణకు, తమిళనాడు కు వెళ్తోంది. ఇదే అసరాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యంపై లక్ష కోట్లు ఎలా అదనంగా సమకూర్చుకోవాలో పధక రచించారు. ఇందలో భాగంగానే తెలంగాణ అంతట కరువుతీరా గతం కన్నా అధిక సంఖ్యలో మద్యం దుకణాలకు అనుమతులిచ్చేందుకు సిద్ధమయ్యారు. మొన్న తెలంగాణలో నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో రెండు తెలుగురాష్ట్రాలనుంచి 70 వేల దరాఖాస్తులొచ్చాయి. దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు వసూలు చేయగా .. అవి నాన్ రిఫండబుల్ అని చెప్పి మరి వసూలు చేసింది. దీనిపై సుమారు రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలుండగా .. ఏపీ సరిహద్దు దుకాణాలకు ఏపీ నుంచి ఒక్కొక్క దుకాణానికి 40 మంది వ్యాపారులు పోటీపడ్డారు. గతంలో మద్యం లాటరీ విధానం ద్వారా తెలంగాణకు రూ. 975.68 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటే, ఈ దఫా ఏకంగా రూ. 425 కోట్ల ఆదనంగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇలా ఏపీలో ప్రవేశపెట్టిన మద్యం విధానాల కారణంగా తెలంగాణకు కాసు పంట పడింది. చేజార్చుకున్న ఆదాయం ఇలా ఉంటే.. తెలంగాణ బోర్డర్ ను పంచుకుంటున్న ఏపీ జిల్లాలకు ప్రతిరోజు కోట్ల రూపాయాల విలువచేసే మద్యం రవాణా జరుగుతోంది. ఇలా మద్యంపై గణనీయంగా ఆదాయం కోల్పొయి అప్పులు పాలౌతున్నాం. చివరికి అప్పులైనా పర్వాలేదు కానీ .. విధానాలను మార్చుకోం అని మొండిగా ప్రవర్తిస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం.











