బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమా అంటేనే ప్రత్యేకమైన క్రేజ్. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత అమీర్ ఖాన్ కు సరైన హిట్ పడలేదు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ నిరుత్సాహ పరిచింది. ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్ధా’ మీదే అమీర్ ఆశలున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకాబోతోంది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. సినిమా విడుదల ఆలస్యం కావడానికి కోవిడ్ ఓ కారణం. ఆస్కార్ అవార్డు పొందిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ లాల్ సింగ్ ఛద్దా రూపొందుతోంది. ఫారెస్ట్ గంప్ చిత్రం 1994లో విడుదలైంది.
ఇందులో టామ్ హాంక్ నటించిన పాత్రను అమీర్ ఖాన్ పోషించారు. శారీరకంగా వికలాంగుడైన వ్యక్తి కథ ఇది. అందరూ ఎలా తప్పుగా ప్రవర్తిస్తుంటారో అతను నిరూపిస్తాడు. అలా అసాధారణ విజయాలను అతడు సాధిస్తాడు. అంతా బాగానే ఉందిగానీ ఈ సినిమా విడుదలకు ఓ పాన్ ఇండియా సినిమా అడ్డు వస్తోంది. అదే కన్నడ్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ 2 చిత్రం. ఏప్రిల్ 14 ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. పైగా అందులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
అసలు ఈ ఏడాది క్రిస్మస్ లో లాల్ సింగ్ ఛద్దా విడుదల చేయానుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేయక తప్పలేదు. అమీర్ ఖాన్ కు మిస్టర్ పెరఫెక్ట్ అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఏ విషయంలోనూ రాజీ పడడు. తనకు సినిమా నచ్చిందే జనంలోకి తీసుకు రాడు. అలా నిర్మించిన ‘దంగల్’ ఎలాంటి వసూళ్లు సాధించిందో అందరికీ తెలుసు.
ఆ రికార్డును ‘లాల్ సింగ్ ఛద్దా’తో బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. ఇందులో కరీనా కపూర్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఫారెస్ట్ గంప్ చిత్రంలో జెన్నీ పాత్ర స్ఫూర్తితో కరీనా పాత్రను మలిచారు. దంగల్, కేజీఎఫ్ 2 చిత్రాలు రెండూ ఒకేసారి విడుదలైతే మాత్రం బాక్సాఫీసు వసూళ్లకు ఇబ్బంది కలుగుతుంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా గంగూభాయి కతియావాడి సినిమాతో ఇలాంటి ఇబ్బందే ఏర్పడింది. రాజమౌళి రిక్వెస్ట్ మేరకు గంగూభాయి విడుదల తేదీని వాయిదా వేశారు. మరి ఈ రెండు సినిమాల విషయంలో ఎవరు వెనక్కు తగ్గుతారో వేచి చూడాలి.











