ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతల హస్తముందనడానికి మరో కీలకమైన ఆధారం దొరికింది.ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన C.H.వెంకటేష్ నాయుడు..ఓ డెన్‌లో నోట్ల గుట్టలను లెక్కిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో వెంకటేష్ నాయుడు A-34గా ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వెంకటేశ్‌నాయుడు ప్రధాన అనుచరుడు. ఈ వీడియోతో లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు ఎంత పెద్దమొత్తంలో వెనకేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
లిక్కర్ స్కామ్‌లో కేవలం కిక్‌బ్యాక్స్ ద్వారానే దాదాపు రూ.3,500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సిట్ పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల నగదు డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకుంది. తాజాగా బయటపడిన వీడియో పరిశీలిస్తే లిక్కర్ స్కామ్‌లో పెద్ద మొత్తంలో దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో అరెస్టైన నిందితుల సెల్‌ఫోన్లలోని డేటాను రిట్రైవ్ చేసిన సిట్ అధికారులు ఈ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అనేక వీడియోలు సిట్‌కు లభ్యమైనట్లు తెలిసింది. ఇవి తిరుగులేని ఆధారాలుగా మారనున్నాయి.
వీడియోలో ఏముంది –
ఓ గదిలో నల్లటి టీపాయ్‌పై నిలువుగా, అడ్డంగా ఆరేడు వరుసల్లో రూ.500, రూ.100 నోట్లు కట్టలు కట్టి ఉన్నాయి. వాటిని వెంకటేశ్‌నాయుడు లెక్కిస్తున్నారు. కొన్ని కట్టల్ని చూపిస్తూ..ఇక్కడి వరకూ 4 అని చెబుతున్నారు. మరికొన్ని నోట్లకట్టల్ని చూపించి మొత్తం 5 అని వివరిస్తుంటారు. ఆయన అలా లెక్క చెబుతుంటే మరో వ్యక్తి ఆ నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో నింపుతున్నారు. అక్కడున్న నోట్ల కట్టలు, వెంకటేశ్‌నాయుడు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే..ఆ మొత్తం రూ.5 కోట్లని అర్థమవుతోంది. ఈ డబ్బును అప్పట్లో ఎక్కడికి తరలించారు? ఎవరికి చేర్చారనేదానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో 2021 నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసుకునే వెంకటేష్ నాయుడు..చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. బాల్య స్నేహితుడు కూడా. మద్యం ముడుపుల సొమ్మును డెన్‌లో భద్రపరచటం, ఆ సొత్తును గత ప్రభుత్వ పెద్దలకు చేరవేయటంలో చెవిరెడ్డి, వెంకటేశ్‌ల పాత్ర ఉన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది.లిక్కర్ స్కామ్‌లో తమ ప్రమేయంపై విచారణ జరుగుతోందని తెలిసిన వెంటనే వీరిద్దరూ శ్రీలంక మీదుగా మాల్దీవులు, మాలే దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారు బెంగళూరు విమానాశ్రయంలో ఉండగా సిట్ అధికారులు గుర్తించి, జూన్ 18న అరెస్టు చేశారు











