ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లొకెక్కారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ దివ్వెల మాధురితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఐతే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనపై ఇప్పుడు కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో పవన్‌పై నోరు పారేసుకున్నారు దువ్వాడ. అప్పట్లోనే స్థానిక జనసేన నేతలు శ్రీకాకుళం జిల్లా, హిరమండలం పోలీస్ స్టేషన్‌లో దువ్వాడ మీద ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు.
దువ్వాడ ఏమన్నారు –
ఎన్నికలకు ముందు ఓ టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మాత్రం ప్రశ్నించడం లేదు. ఎందుకంటే.. పవన్, చంద్రబాబు దగ్గర నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారు. అందుకే చంద్రబాబును ప్రశ్నించడం లేదు అని దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్‌లో అనూహ్యంగా దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. అప్పటి నుంచి ఆయన ఫ్రీ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దివ్వెల మాధురితో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి మీడియా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ ఇంటర్వ్యూల్లో వైసీపీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై వైసీపీలోనే కొంత మంది కుట్ర చేశారని చెప్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు అధినేత జగన్ కోసం మైకుల ముందు రెచ్చిపోయేవారు దువ్వాడ. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసేవారు. గతంలో జగన్ మెప్పు పొందడానికి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దువ్వాడను వెంటాడుతున్నాయి











