ఈరోజు హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని, ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. మన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ఏపీ సర్కారు ఇచ్చిన జీవోను కొట్టి వేసి అశోక్‌ను నియమించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుందో చూడాలన్నారు. మన్సాస్ ప్రజల కోసం పుట్టిన సంస్థ అని, తనపై పగతో ఉద్యోగులు, సామాన్యులను ఇబ్బందులు పెట్టారని అన్నారు.
వాళ్లను తొక్కేశాడు.. నాశనం అయ్యాడు… జగన్‌పై ఏబీవీ సంచలన కామెంట్స్…!!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కళ్లు...