ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మూడేళ్ళలో ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన సిఎం గా జగన్ ఏనాడైనా బయటకు వచ్చి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చకపోగా ప్రజలను పన్నుల భారంతో పిడి గుద్దులు గుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి పుట్టినరోజుణ శుభాకాంక్షలు కూడా చెప్పని దుర్మార్గుడు జగన్ అని.. కష్టకాలంలో తనకోసం అహర్నిశలు శ్రమించిన తల్లి , చెల్లిని తరిమేసిన స్వార్ధపరుడని ఆరోపించారు. బాబాయి కేసులో ఆరోపణల పై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన అయ్యన్న, వివేకా కేసులో జగన్ ఎందుకు వెనక్కి తగ్గారవ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో జగన్ పాలన చూసి అప్పుడు రావాలి జగన్ అన్నవారే.. ఈరోజు పోవాలి జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు
కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...