జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందన్ తొలిసారి రక్తదానం చేశారు. 18 వ ఏటలోకి అడుగుపెట్టిన అఖిరా మొదటిసారి రక్తదానం చేశారు. ఈ విషయాన్ని అఖిరా నందన్ తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అఖిరా నందన్ రక్తదానం చేస్తున్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. మన రక్తం ఇంకొకరికి ఎంతో అవసరం కావచ్చునని, కాబట్టి అందరూ రక్తదానం చేయాలని ఆమె కోరారు. కాగా అఖిరా నందన్ రక్తదానం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అదేసమయంలో అఖిరా రక్తదానం చేయడం పై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి తగ్గా తనాయుడిగా అఖిరా నందన్ ఎదగాలని కోరుకుంటున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...