ఒళ్లు దాచుకోకుండా పనిచేయాలన్న నగ్న సత్యం నేటి తారలకు బాగానే వంటబట్టినట్టుంది. ఈ మధ్య ట్విట్టర్ లో తారలు పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే కుర్రకారుకు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఆ జాబితాలో సోనాల్ చౌహాన్ కూడా చేరింది. ఆమె తాజాగా ట్విటర్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి అయినా సోనాల్ తెలుగు వారికీ సుపరిచితమే. బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ తో తెలుగు తెరకు పరిచయమైంది. పండగ చేస్కో, డిక్టేటర్, రూలర్ సినిమాలు చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే ఆమె అందాల పోటీ నుంచి నటిగా వెండి తెరకు పరిచయమైంది. మోడలింగ్ లో కాలు పెట్టి అందాల పోటీలకు వెళ్లింది. గాయకురాలిగా, నటిగా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. అంతా బాగానే ఉందిగానీ ఇలా అందాలను ఆరబోయడం వెనక ఎలాంటి ఉద్ధేశం ఉందో? తారలకు ఈ బికినీలు కొత్త కాదు. ఇలాంటి వాటితో ఫొటోలకు పోజిస్తే అవకాశాలు వచ్చేస్తాయన్న ఆశ కూడా ఉంటుంది. హిమేష్ రేషమ్మియా ఆమెకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చాడు.
జన్నత్ లో ఇమ్రాన్ హష్మతో నటించింది. ఓ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. బీచ్ లో బికినీ తో నడుస్తూ ఎక్సయిటింగ్ మూమెంట్స్ అని పేర్కొంది. మరో ఫొటోలో సేద తీరుతూ ఓ ఫొటో షేర్ చేసి ది గుడ్ షేడ్స్ ఆఫ్ మన్ డే బ్లూస్ అంటూ కామెంట్ చేసింది. ఎదురుగా ఓ కొబ్బరి బొండాం కూడా పెట్టుకుంది. ఆమె ఒక్కర్తే అలా కనిపించింది అంటే తీసే వ్యక్తి మరొకరు ఉన్నట్టే కదా. ఆ వ్యక్తి ఎవరనే క్యూరియాసిటీ ఎవరికి మాత్రం ఉండదు?











