యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కలిసి ఓ భారీ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఈ సినిమాను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ఓ బాబాయ్ పాత్ర ఉందట. ఆ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ అయితే బాగుంటుంది అని కొరటాల అనుకుంటున్నారని తెలిసింది. రాజశేఖర్ కూడా హీరోగానే కాకుండా.. మంచి రోల్ వస్తే.. వేరే హీరో సినిమాల్లో నటించడానికి రెడీ అంటూ ఎప్పుడో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త వినడానికి అయితే.. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఇందులో రాజశేఖర్ ఎన్టీఆర్ బాబాయ్ పాత్ర పోషిస్తే.. ఆడియన్స్ లో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడడం ఖాయం. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రానున్న సినిమా కాబట్టి ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.











