నటసింహ నందమూరి బాలకృష్ణ.. తన సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరో. క్లాస్ లతో సంబంధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల ఆధారాభిమానాలు సంపాదించుకున్నారు బాలకృష్ణ. ఇక బాలయ్య సినిమా వస్తోంది అంటే చాలు ఎన్నో అంచనాలు, మరెన్నో రికార్డులు.
అయితే బాలయ్య తన కెరీర్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించింది మాత్రం తక్కువే అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు 106 సినిమాల్లో నటించిన బాలకృష “సుల్తాన్” సినిమాలో మాత్రమే నెగిటివ్ రోల్ లో కనిపిస్తారు.అయితే తాజాగా తనకు నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు చేయాలని ఉందని ఇటీవల ఓ సందర్భంలో బాలయ్య చెప్పారు. ఆయన మాట చెప్పీ చెప్పగానే అందిపుచ్చుకున్న దర్శకులు ఆయన కోసం కధలు తయారు చేసే పనిలో పడ్డారు. అయితే బాలయ్యను నెగిటివ్ షేడ్స్ తో చూపించే ఛాన్స్ కొట్టేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో బాలయ్య నెగిటివ్ రోల్ ప్లే చేయబోతున్నారు.
గత ఏడాది విడుదలైన అఖండ సినిమా సినిమా విజయంతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ ఫస్ట్‌లుక్ ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసింది. మైనింగ్ గనుల ముందు బ్లాక్ కలర్ షర్ట్, పక్కన ల్యాండ్ రోవర్ కారుతో బాలయ్య డిఫరెంట్‌గా ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ లుక్ సరికొత్తగా ఉంది.
ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ కధానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక బాలయ్య నెగిటివ్ రోల్ పాత్రకి చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిణ కొన్ని సీన్స్ ను హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించినట్టు సమాచారం.ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాగా చిత్రంలో ప్రతి నాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఇక బాలయ్య నెగిటివ్ షెడ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.