మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మం, చట్టం, న్యాయందే అంతిమ విజయం అని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలు జారీచేస్తోన్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన అశోక్ గజపతిరాజు కు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
Must Raead ;- జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జులై 1కి వాయిదా
భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి, సత్యనిష్ఠకి న్యాయస్థానం తీర్పు మరింత వన్నెతెచ్చింది. అరాచక ప్రభుత్వ పాలనపై సింహాచలం అప్పన్న ఆశీస్సులు, ప్రజాభిమానం, చట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజయం ఇది.(2/3)
— Lokesh Nara (@naralokesh) June 14, 2021