ఎన్టీఆర్ కు భారతరత్న దక్కాలన్న నినాదం ఊపందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయాన్ని బలపర్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే అది తెలుగువారికి దక్కే గౌరవమని అన్నారు. ‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం.
వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు.
Must Read ;- నందమూరి బాలకృష్ణ శ్రీ‘రామ’దండకం
View this post on Instagram