నేడు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినీ పరిశ్రమలో ఎందరో బ్రదర్స్.. స్టార్ బ్రదర్స్.. తమ తమ సోదరులకు సోషల్ మీడియా వేదిక గా విషెస్ తెలుపుతున్నారు. వారి చిన్నప్పటి ఫోటోస్ ను, రీసెంట్ ఫోటోస్ ను షేర్ చేసుకుంటూ.. తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తమ బ్రదర్స్ ఫోటోను , అందులోనూ మరీ చిన్నతనంలోని ఫోటో షేర్ చేయడం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఎత్తుకోగా.. ఆ పక్కనే నాగబాబు నిలబడిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో పవర్ స్టార్ చాలా క్యూట్ గా ఉండడాన్ని బట్టి .. మెగా బ్రదర్స్ లో చిరంజీవికి, నాగబాబు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో లేకపోయినా.. పవన్ కళ్యాణ్ తో ఆ ఇద్దరికీ కాస్తంత ఎక్కువగానే ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టుగా అర్ధమవుతోంది. ఈ ఫోటోను పంచుకొన్న చిరు.. తమ అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తోడబుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే అని ట్వీట్ చేశారు.
ఈ ఫోటోను చిరంజీవి ఇలా షేర్ చేశారో లేదో.. అప్పుడే .. బోలెడు లైక్స్, రీట్వీట్స్ తో అభిమానులు స్పందించి.. తక్షణమే వైరల్ చేశారు. గతంలో కూడా చిరంజీవి చాలా సందర్భాల్లో తన సోదరుల్ని ఏదో రూపంలో గుర్తు చేసుకుంటూ.. ఫోటోస్ షేర్ చేస్తూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
Must Read ;- కరోనా బాధిత `బ్లడ్ బ్రదర్స్` కుటుంబాలకు అండగా మెగాస్టార్
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021