స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టవడం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటి వరకూ బాబు అరెస్ట్ వ్యవహారంపై నోరుపెదపకుండా తటస్థంగా ఉన్న నేతలంతా ఇప్పుడు బయటపడుతున్నారు. ఎన్నికల్లో గెలవప్పటికీ తెలుగుదేశం పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు భాగస్వామ్యాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే బాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత బీఆర్‌ఎస్‌లో టెన్షన్ మొదలైంది. మింగలేక కక్కలేక అన్నట్టు బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. ఇందుకు అన్ని పార్టీలు కత్తులు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ టీఆర్‌స్‌లో టెన్షన్ పెంచుతోంది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ బలాన్ని, బలగాన్ని తక్కువ అంచనా వేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు డామేజ్ క్ంట్రోల్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే జరగాల్సిన నష్టం ఇప్పటి కే జరిగిపోయిందని ఎనలిస్ట్‌ల ఎనాలసిస్.
బీఆర్‌ఎస్‌లో ఉన్న నేతల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోతే ఎన్నికల్లో జరిగే నష్టాన్ని వారంతా అంచనా వేశారు. అందుకే అవకాశమున్న చోటల్లా బాబు అరెస్ట్ దురదృష్టకరమని కామెంట్లు చేస్తూ నష్టాన్ని పూడ్చే పనిలో బిజీ అయ్యారు. మరో వైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులంతా ఒకటయ్యారని కూడా ఓ విశ్లేషణ. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ఇప్పటికే పార్టీ పెద్దలకు సమాచారం పంపారు. ఇదే గనుక జరిగితే బీఆర్‌ఎస్ కు చిక్కుల తప్పవని స్వయంగా ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కనీసం ఓట్లను చీల్చినా ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్టవుతుందని ఓ నిర్ణయానికొచ్చిన నేతలు బాబు అరెస్ట్‌పై విమర్శలు మొదలుపెట్టారు. జగన్‌పై విమర్శలు గుప్పించకున్నా.. ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.. బాబుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.. ఎక్కడ బాబు సానుభూతి పరులు, సీమాంధ్ర ఓటర్లు, జగన్ వ్యతిరేక, పవన్ అనుకూల ఓటు బ్యాంక్ చీలిపోతుందనే భయం వారిలో కనిపిస్తోంది.. అందుకే, రోజుకో నేత పదే పదే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకి మద్దతు ప్రకటిస్తున్నారు..
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ హైకమాండ్ స్టాండ్ ఎటువైపు ఉన్నప్పటికీ పట్టించుకోని నేతలంతా… తమ అభిప్రాయాలను మాత్రం స్పష్టంగా చెప్పేస్తూ ఓటర్లను జారిపోకుండా కాపాడుకునే ప్రయత్రాలు ప్రారంభించారు.










