చంద్రబాబును అరెస్ట్ చేయించినప్పటి నుంచి సీఎం జగన్ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా
విమర్శలు ఎదుర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులు, బాబాయ్ వివేకా హత్య … ఇలాంటి
చిక్కుల నుంచి తప్పించుకు తిరుగుతున్న జగన్… చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో అభాసుపాలయ్యారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొండి వైఖరితో సొంత పార్టీ నేతల్లో సైతం విమర్శలు ఎదుర్కొని చిక్కుల్లో పడ్డ సీఎం జగన్‌కు ఇంటా బయటా విమర్శలు తప్పటం లేదు.
జాతీయ నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జగన్ దే తప్పంతా అంటూ విమర్శిస్తున్న వేళ
ఢిల్లీలో అడుగుపెట్టిన సీఎం జగన్‌కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు గురువారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. అధికారికంగా ఆయన పర్యటన రాష్ట్రానికి సంబంధించిందే అయినప్పటికీ ఆయన కలిసిన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు మాత్రం జగన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారట. చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటిషియన్ తో అలా వ్యవహరించటం సరికాదన్న అభిప్రాయాన్ని జగన్ ముందు స్పష్టం చేశారట. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో షాక్ తిన్న సీఎం జగన్ తాను చెప్పదల న్న విషయాన్ని , కేంద్రం ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలనుకూడా ఇవ్వకుండానే వచ్చేశారని కీలక సమాచారం.
వామపక్ష తీవ్రవాదంపై జరిగే సదస్సులో జగన్ పాల్గొన్నాక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతోనూ
సమావేశమవుతారు. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్… పర్యవసానాలను జగన్ ఢిల్లీపెద్దలముందుంచటం ఖాయం. ఇప్పటికే చాలా మంది ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా బీజేపీ సీనియర్లు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జగన్ తీరును తప్పుబట్టగా.. మోదీ, అమిత్ షా ఎలా స్పందిస్తారో అని జగన్ టెన్షన్ పడిపోతున్నారట. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ సీఐడీ సేకరించిన ఆధారాలను సీఎం జగన్ కేంద్రంతో పంచుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహాంలో బీజేపీ పెద్దల పైనా విమర్శలు రావటంతో జగన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారట. అనుకున్నదొకటి అయిందొకటి అన్న రీతిలో ఢిల్లీ పర్యటనలో తాను తలచింది ఒకటతే ఎదురవుతున్న అనుభవాలు మరోలా ఉన్నాయేంటా అని జగన్ లో కంగారు మొదలైంది. మునుముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని కూడా జగన్ ఆందోళన పడుతున్నారు.