సొంత డప్పు కొట్టుకోవడం.. ప్రతిపక్షాలపై బురద జల్లడమే విధానంగా పెట్టుకొంది వైసీపీ. గత ఎన్నికల ముందు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై తప్పుడు కథనాలతో విపరీతమైన దుష్ర్పచారం చేసి అధికారంలోకి వచ్చారు జగన్ రెడ్డి. అయితే ఈసారి అలాంటి గాలి వార్తలు, న్యూస్ పేరుతో వచ్చే నాన్సెన్స్‌కి గట్టిగా కౌంటర్ ఇస్తోంది టీడీపీ. వైసీపీ నాయకులు చెప్పే అబద్దాలు, అర్ధసత్యాలను తిప్పికొట్టి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సోషల్ మీడియాలో వైసీపీ మీద పైచేయి సాధించి పర్‌సెప్షన్ వార్‌లో టీడీపీని గెలుపు బాటలో నడిపిస్తున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి చింతకాయల విజయ్. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఐ టీడీపీ సారధిగా ఉన్న విజయ్‌ని టార్గెట్ చేసుకొంది వైసీపీ అబద్దాల మిషనరీ.
చింతకాయల అయ్యన్న పాత్రుడుకి రాజకీయ వారసుడిగా కాకుండా.. సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు చింతకాయల విజయ్. గత పుష్కర కాలం నుంచి నిరంతర శ్రమ, పట్టుదలతో.. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాన కార్యదర్శి లెవెల్‌కి చేరుకున్నారు విజయ్. బ్యానర్లు, పోస్టర్లతో రాజకీయాలు చేసే రోజులు పోయి ఫేస్‌బుక్ పోస్టులు, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి వచ్చాయి పోలిటిక్స్. ఈ విషయాన్ని గ్రహించి ఆన్‌లైన్‌లో సైకిల్‌ను పరుగులు పెట్టించారు విజయ్. పార్టీ కోసం ఆయన చేసిన సేవలతో ఇంప్రెస్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి చింతకాయల విజయ్‌ని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు.
ఈసారి ఎలక్షన్స్‌లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ-జనసేన కూటమి జగన్ పార్టీని తుడిచి పెట్టేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న చింతకాయల విజయ్ టార్గెట్‌గా అబద్దాల ప్రచారానికి తెరతీసింది వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్. విజయ్ తండ్రి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై దుష్ప్రచారం ప్రారంభించారు. నర్సీపట్నంలో లోకేశ్ యువగళం పాయాత్రకు మద్దతు ఇవ్వబోనని అయ్యన్న చెప్పారంటూ తప్పుడు వార్త సృష్టించి వైరల్ చేయడానికి ప్రయత్నిస్తోంది వైసీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ.
జగన్ గ్యాంగ్ అడ్డగోలుగా పుట్టించిన పుకార్లపై టీడీపీ నేతలు సీరియస్‌గా స్పందించారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ యువనేత లోకేశ్ నిర్వహించిన నిరసన కార్యక్రమం, బహిరంగ సభకు భారీ స్పందన వచ్చింది. లక్షలాది ప్రజలు లోకేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లోకేశ్ ప్రజాదరణ చూసి.. ఆయన పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని సూచన చేశారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. యువగళం పాదయాత్ర చేయాలని లోకేశ్‌ను మొదటి నుంచి ప్రోత్సహించి అయ్యన్నపాత్రుడు, తన సొంత నియోజకవర్గంలో.. ఎందుకు అడ్డుకుంటారు. ఇంత చిన్న లాజిక్ కూడా వైసీపీ నేతలకు తట్టలేదు. జగన్ అండ్ కో విమర్శల వెనుక సరైన కారణాలు, సౌండ్ రీజనింగ్ లాంటివేమీ ఉండవు. అయినా అబద్దాలకు అర్ధం, పరమార్ధంతో పనేముంది. ఆ సమయానికి ఏమనిపిస్తే అది అనేస్తారు.
బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయి 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వలస పాలకుల విధానాలతో ప్రజలను బానిసలుగా చూస్తూ.. నిరంకుశంగా పాలించే నాయకులు ఇంకా మిగిలే ఉన్నారు. ఏపీ వైసీపీ ప్రభుత్వమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ప్రజలను కులాలు, వర్గాలుగా విడదీసి అందరి మీదా పెత్తనం చేయడంలో బ్రిటీష్ వాళ్లను మించిపోతున్నారు వైసీపీ పెద్దలు. ఫేక్ న్యూస్‌తో టీడీపీ నాయకులు, అధిష్టానం మధ్య విభేదాలు సృష్టించి పార్టీని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ వ్యూహకర్తలు. ఇలాటి తప్పుడు ప్రచారాలు, గాలి వార్తలు నమ్మి మరోసారి జగన్ మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.











