ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.., పెన్సనర్లు ఏ పాపం చేసుకుంటే.. ఇటువంటి ముఖ్యమంత్రి దొరికాడు రా బాబు అంటూ జగన్ చర్యలను గుర్తు చేసుకుంటూ నేడు మదనపడుతున్నారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలం జీతాలు పడక వారి జీవితాలు కడు దుర్బరంగా మారాయి. ప్రతి నెల 15 తరువాత కూడా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న వివిధ శాఖల అధికారులు, పెన్సనర్లు ఉన్నారన్నది అక్షరం సత్యం. ప్రతి నెల జీతాలు.., పెన్సనర్ల జీతాలకు దాదాపు 5 వేల కోట్లకుపైగా కావాల్సి ఉంది. వీటికి సామాజీక ఫించన్లు అధనం. అయితే ఇప్పటి వరకు జీతాలు 2 వేల 800 కోట్లు, పెన్షన్లు 1500 కోట్లు చెల్లించారు. ఇంకా 1300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఆర్బీఐ కు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అప్పు 3 వేల 200 కోట్లు, ఓడీ అప్పు 1500 కోట్లు మొత్తం 4 వేల 700 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ వచ్చినా.. ఇంకా 60 శాతం పైగా ఉద్యోగులకు,పెన్సనర్లకు జీతాలు పడలేదు. ప్రతి నెల జీతాలు సక్రమంగా రావడం లేదు.. ఇంటి అద్దెలు.., ఇనిస్టాల్మెంట్స్, ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని.. ఉద్యోగులు లబోదిబో మంటున్నా.. జగన్ సర్కార్ కు కనికరం లేదు. దార్శికనిత లేని ముఖ్యమంత్రి దొరకడం మా దౌర్భాగ్యం అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు పెన్సనర్ల వెతలు వర్ణాతాతీతం.
దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి హక్కుల కోసం పోరాడటం సర్వసాధారణంగా మారుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఏపీలో విచిత్ర నెలకొంది. దాదాపు నాలుగునరేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు వారంలో చేస్తానని.., ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కార మార్గం చూపుతానని చెప్పిన జగన్ రెడ్డి గద్దెనెక్కిన తరువాత వాటన్నింటీ విస్మరించారు. ఇచ్చిన హామీలను గుర్తు చేసే ఉద్యోగులపై, ఉద్యోగ సంఘాలపై కత్తి దూయడం మొదలుపెట్టారు జగన్ రెడ్డి. ఇలా ఆయన ఇచ్చిన హామీలను అడగకుండా.. జీతాల నెల దాటిపోతున్నా.. ఇంకా వేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో హామీల మాట దేవుడెరుగు.. కనీసం జీతాలన్న వేయండి మహా ప్రభో..అంటూ వేడుకునే స్దితికి ఉద్యోగులను, ఆయా సంఘాల ప్రతినిధులను తీసుకొచ్చారు.
ఇలా ఉద్యోగుల ఉసురు తీస్తూ.. జగన్ అనుసరిస్తున్న విధానాలు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్సర్ల పాలిట శాపాలు మారాయి. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చింది భూటకపు హామీలని తేలిపోయాయి.











