రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. గుర్తులు తారుమారు కావడం, మహిళలకు కేటాయించిన స్ధానంలో పురుషులు పోటీలో ఉండడాన్ని పోలింగ్ సమయంలో గుర్తించారు ఎన్నికల అధికారులు.
ఇలాంటి ఘటన అనంతపురంలో వెలుగులోకి వచ్చింది. అనంతపురం కోడిపల్లి పంచాయతీ పరిధిలో బీసీ మహిళలకు కేటాయించిన స్ధానంలో బీసీ వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడనే ఫిర్యాదు అందుకున్న అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. వీటితో మరికొన్ని ప్రాంతాలలో కూడా కొన్ని సమస్యలు తలెత్తున్నాయి. నెల్లూరు జిల్లా, కోవూరులో భారీ వర్షాల కారణంగా బ్యాలెట్ బాక్స్ తడిసిపోవడంతో పాటు.. పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. కర్నాలులో బైచిగేరిలో గుర్తులు తారుమారు కారణంగా పోలీంగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగుతున్న పోలింగ్ తీరు చూస్తుంటే.. 80 శాతం పైగా పోలింగ్ నమోదు కావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.











