జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ముంబై సాగా’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ లో థియేట్రికల్ రీలీజ్ అయింది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ కరోనా కారణంగా చాలా తక్కువ వసూళ్ళు దక్కాయి. ముంబై .. బొంబాయిగా ఉండే టైమ్ లో జరిగిన కొన్ని సంఘటనల సమాహారమే ఈ సినిమా. బాల్ థాకరే ఛాయలున్న పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ నటించారు.
ముంబైలోని ఒక ఏరియాను గుప్పెట్లో పెట్టుకొని కొంత మంది సాగిస్తున్న అరాచకాల్ని అడ్డుకున్న ఓ యువకుడు.. ఒక దశలో ముంబైనే శాసిస్తాడు. అతడ్ని అడ్డుకోడానికి ఓ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఆ పోలీస్ కు, ఆ యువకుడికి జరిగే వార్ ఈ సినిమా మిగతా కథ. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇప్పుడు మంచి రెస్సాన్స్ వస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు ఓ నిర్మాత. అంతేకాదు.. తెలుగు వెర్షన్ కోసం ఇద్దరు మెగా హీరోలు ముందుకొచ్చారట. ఆ హీరోలు ఎవరన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. మరి ఈ సినిమాలో నటించబోయే ఆ మెగా హీరోలెవరో , ఆ నిర్మాత ఎవరో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.