ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పుష్ప 2’. పుష్ప 1 ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మికన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పుష్ప 1 లో లాగానే ఈ చిత్రంలో కూడా గ్లామర్ డోస్ అంటించాలని దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అందుకోసం గ్లామర్ గర్ల్ “దిశా పటాని” ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో “ఊ.. అంటావా మావా” అంటూ సమంతా కుర్రకారుకు వెర్రెక్కించగా అందుకు తగ్గకుండా ఉండేలా పుష్ప 2 లోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోందట.
ఇక ఫస్ట్ పార్టులో ఎస్పీ గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ రెండో పార్ట్ లోనూ కనిపించనున్నారు. కాగా సెకండ్ పార్ట్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో స్టార్ హీరోను దిమ్పుతున్నారత దర్శకుడు సుకుమార్. బాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో అలరించిన నటుడు సునీల్ శెట్టిని ఈ పాత్ర కోసం చూస్తున్నారని టాక్. ఇటీవల తెలుగులో పలు చిత్రాలు చేస్తున్న సునీల్ శెట్టి అయితే ఈ క్యారెక్టర్ బాగుంటుందనే ఆలోచనతోనే ఆయనను ఎంపిక చేయబోతున్నారట. కాగా, ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశారనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలోని బలమైన పాత్రల్లో ఇదొకటని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.