టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న చాలా మంది స్టార్ హీరోయిన్లు షూటింగ్ ఉన్నప్పుడూ, ప్రమోషన్స్ టైమ్ లో హైదరాబాద్ లో ఉంటుంటారు, పని అవ్వగానే బాంబే వెళ్లిపోతుంటారు. చాలా మంది తెలుగు స్టార్ హీరోయిన్లకి బాంబే అడ్డాగా మారిపోయింది. యాడ్ షూట్స్, నైట్ పార్టీలు, సీక్రెట్ లవ్ ఎఫైర్స్, షాపింగులు ఇలా చాలా పనులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు బాంబేనే వాడేసుకుంటూ ఉంటారు. అయితే కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇండియాలో ఉన్న మిగతా సిటీలకంటే బాంబేనే బాగా ఎఫెక్ట్ అయింది.
చాలా మంది తెలుగు హీరోయిన్లు బాంబేలో తమ ఫ్లాట్స్ లో చిక్కుకొని భయంగా చాలా కాలం గడిపారట, అయితే ఈ దెబ్బకి మన తెలుగు హీరోయిన్లకి చాలా మంది బాంబే అంటేనే భయపడిపోతున్నారని కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే, భాగ్యనగరంలో ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తోందట, పూజా సినిమాల్లో గట్టి పోటీ ఇస్తున్న రష్మక కూడా హైదరాబాద్ లో సొంత మకాం పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక పాయల్ రాజ్ పుట్, రాశీ ఖన్నా వంటి నార్త్ బ్యూటీలు ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వీరితో పాటే కొందరు అప్ కమింగ్ హీరోయిన్లు కూడా హైదరాబాద్ మీద మోజు పడుతున్నారు. మొత్తానికి ఈ అందగత్తెలతో హైదరాబాద్ కళకళలాడేలా ఉంది.