బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఆమెను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. డ్రగ్ డీలర్లలతో ఆమెకున్న సంబంధాలను సీబీఐ బయట పెట్టింది. రియాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని అందుకు ఎటువంటి పరీక్షకైనా తాము సిద్ధమని ఆమె తరపు లాయర్ తెలిపారు. కానీ సీబీఐ అధికారులు ఈ కేసుపై లోతుగా విచారణ చేపట్టారు. రియా తన ఫోనులోని సమాచారాన్ని మొత్తం డిలీట్ చేసిందని గుర్తించిన అధికారులు ఆ ఫోన్ ను నిపుణులకు అప్పగించారు. రిట్రీవ్ చేసిన డేటాను అధికారులు విచారించారు. ఆ డేటాలో ఆమె పలుమార్లు డ్రగ్ డీలర్లతో మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో వారి చాటింగ్ డేటాను కూడా అధికారులు బయట పెట్టారు.
ఆ ఛాటింగ్ లో వారు డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నట్టు తెలిసింది, నిషేదిత మిథైలీన్ డయాక్సీ మిథాంఫిటమైన్ (ఎండీ) కావాలని ఆమె అడగటం అందుకు ఆ డీలర్ ఉందని చెప్పడం ఆ ఛాటింగ్ లో ఉంది. తాజాగా కూడా ఆమె మరో డ్రగ్ డీలర్ తో ఛాటింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎండీ కావాలని ఆమె అడగడంతో అందుకు ఆ డీలర్ తమ దగ్గర లేదని మరో డీలర్ దగ్గర ఉందని చెప్పడం ఆ ఛాటింగ్ లో ఉంది. ఎక్కువ మోతాదులో కావాలంటే దొరకదని తక్కువగా ఉందని ఆ డ్రగ్ డీలర్ చాట్ చేశారు. సీబీఐతో బాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆమె ఫోను సమాచారాన్ని విశ్లేషిస్తోంది.
రియాకు చెందిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసిన ఈడీ విచారణ జరుపుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. మని లాండరింగ్ జరిగిందని గుర్తించిన అధికారులు కేసు విచారణను వేగవంతం చేసింది. కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణియన్ స్వామి కూడా ఆత్మహత్య జరిగిన రోజు సుశాంత్ ను ఓ డ్రగ్ డీలర్ కలిశాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద సుశాంత్ ఆత్మహత్య కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది.