మాస్ మహారాజ్ రవితేజ చాలా కామ్ గా ఉంటూ ఉంటాడు. తన సినిమాలు, షూటింగ్స్, ఫ్యామిలీ… రవితేజ టైమ్ మొత్తం ఈ మూడు అంశాల్లోనే గడిచిపోతుంది. వివాదాల్లోకి రవితేజ రానేరాడు, అయితే మీడియాతో కూడా రవితేజ పెద్దగా కాంటాక్ట్ లో ఉండకపోవడంతో రవితేజ్ పై రకరాకాల ఊహాగానాలు ప్రచారం అవుతూ ఉంటాయి. ఇక రవితేజ ప్రస్తుతం గోపీ చంద్ మలినేని డైరెక్షన్ లో ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు.
తమిళంలో హిట్ గా నిలిచిన సేతుపతి సినిమాకి క్రాక్ ఫ్రీమేక్, అయితే కరోనా కారణంగా ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. దీని పై ఇంకా క్రాక్ నిర్మాతలు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రవితేజ – నిర్మాత కోనేరు సత్యనారాయణ – దర్శకుడు రవి వర్మ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది.
రవితేజ క్రాక్ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన తరువాత దానికి వచ్చే రెస్పాన్స్, బిజెనెస్ అన్నీ చూసుకొని ఎంత బడ్జెట్ పెట్టాలో ఫిక్స్ అవుదామని నిర్మాత కోనేరు సత్యనారయణ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. దీనికి తోడు తమిళంలో గత రెండేళ్లుగా విడుదల అవ్వకుండా ఎడిట్ సూట్ లోనే ఉండిపోయిన శతరంగ వెట్టై 2 ని తెలుగు రీమేక్ సినిమాగా తీద్దామని ఈ ప్రాజెక్ట్ దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ ఇంతలోనే అమెజాన్ ప్రైమ్ వారు శతరంగ వైటై 2 ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఈ రీమేక్ ప్లాన్ తో పాటు సినిమాను కూడా ఆపేశారట రవితేజ అండ్ టీమ్.