సినిమా రంగంలో బికీనీలకు భలే క్రేజ్ ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా ఏదో ఒక రోజు బికినీ వేయక తప్పదు. ఎన్నిసార్లు ఎంతమంది హీరోయిన్లు బికినీ వేసినా సరే, ఈ ట్రెండ్ ని సినీ రసిక అభిమానులు ఎల్లప్పూడూ ఆదరిస్తూనే ఉంటారు. స్కిన్ షో చేసే హీరోయిన్ల కంటే హోమ్లీ గా ఉంటూ అప్పుడప్పుడూ బికినీల్లో తళ్లుక్కుమనే హీరోయిన్లకే రసికరాజుల హృదయాల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. సమంత, ప్రియమణి లాంటి హీరోయిన్లు బికీనీల్లో మెరిసినప్పుడు వారి కెరీర్ గ్రాఫ్ అమాంతం పుంజుకుంది. అయితే ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నాకి మాత్రం బికినీ ట్రెండ్ అంతగా కలిసి రాలేదు.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా రాశీ ఖన్నా ‘బెంగాల్ టైగర్’ సినిమాలో బికినీ వెసింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రాశీ బికినీ వేసినట్లుగా ఎవ్వరూ గుర్తుపెటుకోలేదు. ఆ తరువాత రాశీ కెరీర్ గ్రాఫ్ కూడా జారిపోతూ వచ్చింది. దానికి గతేడాది వరకు రాశీ వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉండటంతో ఈ బ్యూటీకి ఇంక సినిమాలు రావని అంతా ఫిక్స్ అయిపోయారు, కానీ అనూహ్యంగా రాశీ వెయిట్ లాస్ అయిపోయి స్లిమ్ అండ్ ఫిట్ బాడీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసరికి ప్రస్తుతం ఈ హాటీకి ఆఫర్లు తెగ వస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళం నుంచి రాశీని హీరోయిన్ బుక్ చేసుకోవడానికి ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాశీకి తమిళ స్టార్ హీరో సూర్యకి జంటగా నటించే అవకాశం వచ్చిందట, ఈ సినిమాలో రాశీ ఫుల్ గ్రామర్ గా కనిపించబోతుందని అంటున్నారు. ఈ మూవీలో ఓ సాంగ్ కోసం రాశీ బికినీలో కనిపించబోతుందని తమిళ వర్గాల టాక్. మరి ఈ బ్యూటీ బికినీ లుక్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.











