తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్టీలో చురుగ్గా వ్యవహరించే నేతలకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు దీనిపై చంద్రబాబు మేధోమథనం చేశారు. జూమ్ ద్వారా ఇప్పటికే 12 పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో చంద్రబాబు చర్చించారు.
దీనిపై కార్యకర్తల అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ (ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్సు సిస్టమ్ ) ద్వారా తెలుసుకున్నారు. అన్నీ క్రోడీకరించి ఇప్పటికే లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ పార్టీ అధ్యక్షుడిగా అచ్చన్నాయుడు పేరు ఖరారు అయింది. అయితే ఈనెల 27న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో ప్రతి జిల్లాకు టీడీపీ అధ్యక్షులను నియమించేవారు. తాజాగా ప్రతి పార్లమెంటు స్థానానికి ఓ అధ్యక్షుడిని నియమించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై కసరత్తు చేసిన బాబు లిస్టు కూడా రెడీ చేశారని సమాచారం. ఈ నెల 27న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో పాటు, పార్లమెంటు స్థానాలకు పార్టీ అధ్యక్షుల పేర్లు కూడా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది.
జగన్ ఆలోచనకు పరోక్షంగా జై కొట్టడమే..
ఏపీలో ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఓ జిల్లాగా చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎలాగూ రాబోయే కొద్ది నెలల్లో ఏపీలో 25 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 25 మంది చురుకైన నేతలను ఎంపిక చేసేపనిలో పడ్డారు. ఈ ప్రయత్నం 25 జిల్లాల జగన్ ఆలోచనకు, ముందే జైకొట్టడం లాగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి
గణబాబు వస్తున్నాడంటేనే గుబులు : అయ్యో .. బెహరా..!
అన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తూ దీనిపై చంద్రబాబు తీవ్ర కసరత్తే చేస్తున్నారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల పరిధిలో పనిచేసేందుకు ముగ్గురు నేతలను సిద్దం చేశారు. అన్నీ వర్గాలకు పార్టీలో పెద్దపీట వేస్తూ ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓసీ అభ్యర్ధులను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించనున్నారని సమాచారం. ఇలా రాష్ట్రం మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మందిని నియమించే ప్రక్రియను వేగవంతం చేశారు.
యువతకు పెద్దపీట
టీడీపీలో సీనియర్లను పక్కన పెట్టి యువనేతలను రంగంలోకి దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కోవాలంటే యువనేతలతోనే సాధ్యమని భావిస్తున్నారు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి పేరు దాదాపు ఖరారు చేశారు. 25 పార్లమెంటు స్థానాలకు కూడా 25 మంది అధ్యక్షులను నియమించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.
కొడాలి నాని రెచ్చగొట్టుడు.. వ్యూహాత్మకమా.. ఉద్రేకపూరితమా?
వారి వయసు పరిగణనలోకి తీసుకుని 45 నుంచి 55 మధ్యలో ఉండే నేతల కోసం గాలిస్తున్నారు. ఇటు ఆరోగ్యంగా ఉండటంతోపాటు వైసీపీని అన్నీ విధాలా ఎదుర్కోగలిగే నేతల కోసం వడపోతలు జరుగుతున్నాయి. వీరి ఎంపిక కోసం టీడీపీ అధినేత రెండు నెలలుగా చేస్తున్న కసరత్తు మరో 3 రోజుల్లో కొలిక్కి రానుంది. ఆ తరవాత వారి పేర్లను 27న ప్రకటించే అవకాశం ఉంది.
ఎస్సీ,ఎస్టీ, బీసీలకు పెద్దపీట
పార్టీని నడిపించేందుకు యువనేతలతోపాటు ఎస్సీ,ఎస్టీ,బీసీలకు పెద్దపీట వేయనున్నారు. పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించడంతోపాటు వారి పరిధిలోని బాధ్యతల విషయంలో మరెవరూ వేలుపెట్టే అవకాశం లేదు. వారికి కేటాయించిన పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నారని సమాచారం. ఈ షరతుతోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడానికి అచ్చెన్నాయుడు అంగీకరించారని తెలుస్తోంది.











