బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో తెదేపా నేత ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మనోవికాస్ నగర్ లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్ రావు, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. కొద్దిసేపటికే వదిలేశారు ఈకేసులో అఖిలప్రియ దంపతుల పేర్లు బయటికి రావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read ;- ఆ హరీష్ కోసం వచ్చి.. వీరిని కిడ్నాప్ చేశారా?