కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 3 కోట్ల మందికి పైగా ఈ వైరస్ భారిన పడ్డారు. 9 లక్షల 76 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ మనదేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 57 లక్షల మంది పాజిటివ్ గా తేలగా 90 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ లో చైనా, వుహాన్ లో బయటపడ్డ ఈ వైరస్ మార్చి నాటికి ఇండియాలో పూర్తిగా వ్యాపించింది. దీంతో కేంద్రం మార్చి 24 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. ఆ తరువాత విడతల వారీగా అన్ లాక్ చేస్తూవస్తోంది. ఈ వైరస్ కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాకపోవడంతో ప్రజలు భయంతో ఉన్నారు. వ్యాక్సిన్ లు తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు పోటీపడుతున్నాయి. కానీ వాటి విశ్వసనీయతపై నమ్మకం కుదరడం లేదు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ ప్రకటన
కరోనా శ్వాసకోశ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని వైద్యులు, శాస్త్రవేత్తలు తెలియచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఓ చేదు వార్తను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా వాడటానికి శ్వాసకోశ వ్యాధుల వ్యాక్సిన్‌కు 100% సామర్థ్యం ఉండదని వెల్లడించారు. గరిష్ట సామర్థ్యం ఉన్న వ్యాక్సిన్ ను ఆమోదిస్తామని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ నిబంధనల మేరకు కరోనా వ్యాక్సిన్ ముఖ్య లక్షణాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సామర్థ్యం, రోగ నిరోధక శక్తీని పెంచడం, సమర్థత లాంటి అంశాలను ద్రుష్టిలో పెట్టుకొని వాక్సిన్ లకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.
కరోనా నియంత్రణకు శ్వాసకోశ వ్యాక్సిన్ 100 శాతం పనిచేయదని మరోమారు తెలిపారు. 100 శాతం పని చేయకపోయినా గరిష్ట శాతం పనిచేసినా అనుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ వ్యాక్సిన్ లో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ పేరిట వ్యాక్సిన్ విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించారు. ఆక్సఫర్డ్, ఆస్ట్రాజెనికా కలిసి సిద్ధం చేసిన కోవాగ్జిన్ ట్రయల్స్ లో విఫలమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ తో ఏ వ్యాక్సిన్ కు గ్యారెంటీ లేదని అర్ధమవుతోంది.