కూటమి సర్కార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరతీసింది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు 15 వేలు అందిస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సన్న బియ్యంతో వెజ్ బిర్యానీ, అన్నం వండి కూరలతో పిల్లలకు వడ్డించారు. విద్యార్థులు ఎంతో ఇష్టంగా తిన్నారు.
……………….
గత జగన్ పాలనలో పాఠశాలలు వసతి గృహాలకు, గోదాముల్లో ఎక్కువరోజులు నిల్వ ఉన్న బియ్యం సరఫరా చేశారు. బియ్యం ముతకగా ఉండటంతో అన్నం ముద్దలా ఉండేది. కొన్నిసార్లు వాసన కూడా వచ్చేది. దీంతో స్కూల్‌లో అన్నం తినడానికి విద్యార్థులు ఇష్టం చూపేవారు కాదు. బడి పిల్లల్లో చాలా మంది ఇంటికి వెళ్లేవారు. కొందరు ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తెచ్చుకునేవారు. దీంతో మధ్యాహ్న భోజనం అమలుచేసినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. అప్పట్లో ప్రధానోపాధ్యాయులే చౌకదుకాణాలకు వెళ్లి బియ్యం తేవాల్సివచ్చేది. ఈక్రమంలో రవాణాకు సొంత నిధులు ఖర్చుచేయాల్సి వచ్చేది. 50 కిలోల బస్తాకు ఐదు కిలోల బియ్యం తరుగు వచ్చేది.
…………………..
ప్రస్తుతం పౌరసరఫరాల గోదాము నుంచే ఆయా పాఠశాలలకు క్యూఆర్ కోడ్ కలిగిన సన్న బియ్యం బస్తాలు సరఫరా చేశారు. 25 కిలోల చొప్పున పోర్టిఫైడ్ బియ్యం సంచులు ప్రత్యేక ఆకర్షణంగా తయారు చేసి చేరవేశారు. ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన లీప్ యాప్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఓటీపీ వచ్చిన తర్వాత సరిచూసుకుని ఆ బియ్యాన్ని వాడనున్నారు.
…………………..
మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు, వంట చేసేవారికి మండలాల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నారు.శుభ్రమైన పద్ధతుల్లో ఏ విధంగా వంట చేయాలి? పోషక విలువలు పాడవకుండా ఏం చేయాలి? వంట చేసే చోట ప్రమాదాలు ఎదురైతే వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన కొంతమందికి విజయవాడలో శిక్షణ పూర్తిచేశారు. వారు మండలాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.