అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసేవారని, అధికారం పోయినా కూడా ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని జేసీ అన్నారు. ఇప్పటికీ.. పదినిమిషాల్లో ముగించాల్సిన విషయానికి గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారని జేసీ దెప్పి పొడిచారు. పది నిమిషాల్లో ముగించాల్సిన విషయానికి ఆయనకు వంద నిమిషాలు కావాలన్నారు.
చంద్రబాబు ఇతరుల్ని పలకరించడంలో మర్యాదపూర్వక ధోరణి, మానవీయ కోణం ఉండనే ఉండదని జేసీ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే.. ఎవరు కలవడానికి వచ్చినా.. ఆప్యాయంగా పలకరించే వారని, కుశల ప్రశ్నలు, కుటుంబవివరాలు ఆరా తీసేవారని, భుజం మీద చేయివేసి పలకరించేవారని.. అలాంటి మంచి అలవాటు చంద్రబాబులో తాను ఇప్పటిదాకా చూడలేదని జేసీ అన్నారు.