టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సాంకేతికతను వినియోగించడంలో టాప్ అని చెప్పక తప్పదు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఎన్ని మార్గాల్లో వినియోగించగలిగితే… అన్నింటా దానిని వినియోగించుకుని… సత్ఫలితాలను రాబట్టడంలో ఆయన దిట్ట. అంతేనా.. అదే టెక్నాలజీని వినియోగించి ప్రజా ధనాన్ని వీలయినంత మేర నివారించే దిశగానూ కీలక అడుగులు వేయడంలో ఆయనను మించిన వారు లేరనే చెప్పాలి. ఈ తరహా వాదనలను నిజం చేస్తూ చంద్రబాబు ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ నేతలకు కూడా ఆదర్శంగా నిలిచారు.
తన భద్రతా వ్యవస్థల్లోకి డ్రోన్ లకు ఎంట్రీ ఇప్పించిన చంద్రబాబు… తన పర్సనల్ సెక్యూరిటీకి సర్కారీ ఖజానా నుంచి పెట్టే ఖర్చులో నెలకు ఏకంగా రూ.12 కోట్లను ఆదా చేస్తున్నారు. ఒక్క నెలకే తన వ్యక్తిగత భద్రత నుంచే ఇంత మొత్తం ప్రజా ధనాన్ని చంద్రబాబు ఆదా చేస్తున్న తీరుతో పాటుగా… తన పర్సనల్ సెక్యూరిటీలో డ్రోన్ లకు స్వాగతం చెప్పన చంద్రబాబు తీరుపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రముఖుల్లో చంద్రబాబు ఒకరు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో కొనసాగుతున్న చంద్రబాబుకు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ బలగాలు భద్రతను కల్పిస్తున్నాయి. భద్రత కల్పిస్తున్నది కేంద్ర బలగాలే అయినా… వాటి ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొన్నటిదాకా కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో కలుపుకుని మొత్తంగా 600 మంది దాకా సిబ్బందిని చంద్రబాబు భద్రతకు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా… ఆయన ప్రయాణించే కాన్వాయ్ లో ఏకంగా 15 వాహనాలను వాడుతున్నారు. సీఎం హోదాలో ఉండటంతో పాటుగా గతంలో నక్సల్స్ దాడి నేపథ్యంలో ఆయనకు కేంద్రం ఇచ్చిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రత నేపథ్యంలో ఈ తరహా భారీ భద్రత ఆవశ్యమనే చెప్పక తప్పదు.
చంద్రబాబుకు ఇదంతా పెద్ద ప్రహసనంలా అనిపిస్తోంది. అయినా కూడా చంద్రబాబు తనకు భద్రత వద్దని చెప్పడానికి లేదు. ఆయా పదవులు, హోదాలకు వర్తిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం తనకు లభిస్తున్న భద్రతను చంద్రబాబు వద్దనలేరు. చంద్రబాబు వద్దన్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ… చంద్రబాబుకు భద్రతను ఉపసంహరించే ప్రసక్తే లేదు కూడా. అసలే ఆర్థికంగా తీవ్రంగా సతమతమవుతున్న రాష్ట్రం,… కనీసం తన భద్రతకు అయ్యే ఖర్చులో కొంతైనా మిగిల్చినా బాగుంటుందన్న దిశగా ఆలోచన చేసిన చంద్రబాబుకు అదిరిపోయే ఐడియా తట్టింది. దానిని వెంటనే అమల్లో పెట్టేశారు.
ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపేందుకు డ్రోన్లను వినియోగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆత తర్వాత అమరావతి వేదికగా భారీ ఎత్తున డ్రోన్ సదస్సును కూడా నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా డ్రోన్ టెక్నాలజీకి భారీ ఎత్తున ప్రోత్సాహంఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏకంగా డ్రోన్ సంబంధిత పరిశ్రమల కోసం ఏకంగా 300 ఎకరాలను కూడా కేటాయించింది. తాజాగా తన భద్రతా వ్యవస్థలోనూ డ్రోన్ లను వినియోగిస్తే ఎలా ఉంటుందన్న దిశగా ఆలోచన చేసిన చంద్రబాబు.. అదే ఆలోచనను అధికాకుల ముందు పెట్టారు. స్వయంగా సీఎం తన భద్రతలో డ్రోన్లను వినియోగించే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసిన అధికారులు…బాబు ఆలోచన అద్భుతమని తేల్చారు. వెనువెంటనే చంద్రబాబు బద్రతా వ్యవస్థలోకి రెండు డ్రోన్లను వినియోగించేందుకు రంగం సిద్ధం చేయగా… ఇప్పటికే ఆ డ్రోన్లు బాబు సెక్యూరిటీ విధుల్లోకి చేరిపోయాయి కూడా.
కృష్ణా నది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఓ డ్రోన్ నిత్యం ఆయన భద్రతా విధుల్లో పాలుపంచుకుంటోంది. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో మరో డ్రోన్ పరిసరాలను జల్లెడ పడుతూ చంద్రబాబు భద్రతను పర్యవేక్షిస్తోంది. ఈ రెండు డ్రోన్ లు కూడా ముందుగానే ఫీడ్ చేసిన ాన్యువల్ ప్రకారం చంద్రబాబు సంచరించే పరిసరాలను పరిశీలిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి రెండు గంటలకు ఓ సారి తమకు నిర్దేశించిన బేస్ లకు చేరుకుని తమకు తామే రీచార్జీ చేసుకుని మరీ వెళుతుంటాయి. ఇక చంద్రబాబు పరిసరాలను పరిశీలించే క్రమంలో ఆయా పరిసరాలను ఫొటోలు తీసి నిఘా అదికారులకు పంపుతూ ఉంటాయి.
ఇలా చేయడం ద్వారా చంద్రబాబు భద్రత వ్యవస్థలో అధికారుల సంఖ్యతో పాటుగా కాన్వాయ్ వాహనాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. డ్రోన్ల ఎంట్రీ తర్వాత చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న పోలీసు అధికారుల సంఖ్య ఏకంగా 230కి తగ్గిపోయింది. అంటే… సగానికిపైగా అధికారుల సంఖ్య తగ్గిపోయిందన్న మాట. ఇక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్య 11కు తగ్గిపోయిందట. అటు మ్యాన్ పవర్ తో పాటు ఇటు వాహనాల సంఖ్య తగ్గిపోయిన నేపథ్యంలో ప్రతి నెలలో చంద్రబాబు భద్రతకు అయ్యే ఖర్చులో ఏకంగా కూ.12 కోట్లు తగ్గిపోయిందట,