అమరావతి కోసం రైతుల పోరాటం 365 రోజులు దాటింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు దార్శనిక నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో ఉద్వేగంగా ప్రసంగించిన చంద్రబాబు జగన్ విధానాలను, పాలనను దుయ్యబట్టారు. రైతులను క్షోభకు గురిచేస్తున్నారని, ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని జగన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డారు.
ఆరోపణలు తప్ప.. సాక్షాలు లేవు..
శంకుస్థాపన చేసిన స్థలాన్ని చూస్తే కడుపు తులుక్కుపోతుంది. ఇందరి రైతుల వెతలకు కారణమైన ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. కనకదుర్గమ్మ సన్నిధిలో కొలువైన ఈ అమరావతి అమ్మవారి ఆశీస్సులు ఎన్నడూ ఉంటాయి. అవే మన వెంట ఉండి మనల్ని నడిపిస్తాయి. అమ్మవారు మూడోకన్ను తెరిచిన నాడు ఈ రాక్షసులంతా అంతమవుతారు. ఉద్దండరాయినిపాలెం వెళ్లకుండా నన్ను అడ్డుకునే హక్కు ఎక్కడుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కల్లబొల్లి మాటలు వల్లెవేస్తూ అమరావతి కట్టడాన్ని ఆపిన జగన్ ప్రభుత్వం 18 నెలలుగా నిరూపించింది ఏం లేదు. కేవలం ఆరోపణలు తప్ప ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా చూపలేదు.
నాకు ఇల్లు లేదు.. ఇల్లు కట్టుకున్న నువ్వేం పీకావ్
అమరావతిలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని నన్ను ఎగతాళి చేశారు. రాజధాని లేక ప్రజలు అల్లాడుతున్న సమయంలో నాకు ఇల్ల గురించిన ఆలోచన కూడా రాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పెద్ద భవనాన్ని నిర్మించుకున్న జగన్ ఇప్పటి వరకు చేసిందేమిటి? కేవలం ప్రజలను నమ్మించడానికి ఇల్లు అంటూ ప్రణాళిక వేశాడు. మరి తన ఇల్లుగా భావిస్తున్న రాజధానికి ఇంతటి ద్రోహం ఎలా చేస్తున్నాడు. అన్ని పార్టీలు తమ మద్దతును అమరావతికి అనుకూలంగా తెలియజేస్తుంటే.. ఒక్క జగన్ మాత్రమే మూడు రాజధానుల పేరుతో సరికొత్త వితండవాదాన్ని తెర తీశాడు.
కులం.. కులం.. అంటారు
ఎవరైనా ఏదో ఒక కులానికి సంబంధించిన వారుంటారు. ఈ కులంలో పుట్టానికి ఎవరూ కోరుకోలేరు.. అలాగే నేను ఈ కులంలో పుట్టడం నా తప్పా.. నేను పుట్టిన కులం ఏదైనా కావచ్చు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కులం కోసం చేయలేదు. రాష్ట్రంలోని ప్రతి కులం, ప్రతి వ్యక్తికి రాజధాని ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర నడిబొడ్డున రాజధానిని ఎంచుకున్నాను. భవిషత్తు గురించి దూరాలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండే ప్రాంతం కంటే మంచి ప్రదేశం ఎక్కడుంటుంది. ప్రపంచం అంతా అమరావతి గురించి మాట్లాడుకోవాలని కృషి చేయటమే నేను చేసిన తప్పా. అదే తప్పైతే నేను దోషినే. రాష్ట్రమంతా తనవైపు ఉందంటున్న జగన్ రెఫరెండం కు సిద్ధమా అంటూ అవేశంగా ప్రశ్నించారు చంద్రబాబు.
దుశ్శాసనుల్లా తయారయ్యారు
ద్రౌపది వస్త్రం లాగినందుకు ఒక సామ్రాజ్యమే నాసనమైంది. అమరావతి ఉద్యమంలో మహిళల పట్ల దుస్యాసునిడి మాదిరి వ్యవహరించిన ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ప్రజలంతా అమరావతి ని రాజధానిగా వద్దనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. జగన్ కట్టుకున్న ప్యాలెస్లకంటే అమరావతిలో నిర్మాణం ఖర్చు తక్కువైందని సభా ముఖంగా తెలియజేశారు. కొత్త బిచ్చగాడు ఏదో చేస్తాడని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మోసపోయారు. బుగ్గవంక గేట్లు ఒక్కసారిగా తెరిచి కడపను కూడా ముంచిన అసమర్థుడు జగన్
ఈ జగన్ వన్ టైమ్ ముఖ్యమంత్రి
20నెలల్లో ఏమీ చేయలేని వాడు మరో 12 నెలల్లో ఏం చేస్తాడనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి పై అవినీతి అంటూ కొండ ని తవ్వి ఎలుక తోక కూడా పట్టుకోలేదు. అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ విశాఖలో జరుగుతోంది. ఈ సందర్భంగా పోలీసులకు కూడా వార్నంగ్ ఇచ్చారు చంద్రబాబు. ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలి. పేటీఎం బ్యాచ్ తో 3రాజధానుల ఉద్యమం నడుపుతున్నారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం. భారత రాజ్యాంగం పై నమ్మకం లేక రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం అమరావతి రైతులది మాత్రమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం.
పథకాల పేరుతో మసిపూసి మారేడు కాయ
అమ్మఒడి అని ఇచ్చి అయ్యదగ్గర 4రెట్లు గుంజుకుంటుంది ఈ ప్రభుత్వం. పోరాడకపోతే బానిసలుగా మిగిలిపోతామని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. వెంకటేశ్వరస్వామిని, దుర్గమ్మను భావితరాల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా.. ప్రజల చైతన్యం ముందు డబ్బు, అధికారం పనిచేయవు. ముఖ్యమంత్రి భేషరతుగా 3రాజధానులు నిర్ణయం విరమించుకోవాలి లేదా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.