గృహ అవసరాల కోసం నిర్మాతలు, స్టూడియోలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు భూమిని కేటాయించడం, అలాగే మౌలిక సదుపాయాల స్థాపన కోసం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని, దీనిని ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ పరిగణలోనికి తీసుకుని, అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిసి సంతోషం కలుగుతోందని మండలి వెల్లడించింది.
ఇందుకు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మెన్, నిర్మాత టి.ఎస్.విజయచందర్, మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ కుమార్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మండలి తన ప్రకటనలో పేర్కొంది, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమర్థ నాయకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని తాము ఖచ్చితంగా భావిస్తున్నామని, అలాగే తాము విన్నవించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని మండలి వెల్లడించింది.