టాలీవుడ్ స్ర్కీన్ ప్లే ఎక్స్ పెర్ట్స్ లో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. సెన్సిటివ్ పాయింట్స్ తో సెన్సిబుల్ మూవీస్ తీయడంలో ఆయన దిట్ట. ‘ఐతే’ నుంచి ‘చెక్’ మూవీస్ వరకూ ఆయన ఫాలో అయ్యే ఫార్ములా అదే. తన సినిమాల్లో కథే హీరోగా ఉండాలనుకొనే ఆయన.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కోసం పక్కా కమర్షియల్ డైరెక్టర్ గా మారబోతున్నారని టాక్. ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తన కెరీర్ లోనే మొదటి సారిగా ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. ఆ మేరకు ఓ అదిరిపోయే యాక్షన్ స్టోరీని కూడా రెడీ చేసుకుంటున్నాడట.
రీసెంట్ గా ‘చెక్’ మూవీని డైరెక్ట్ చేసిన ఏలేటి.. ఆ మూవీ రిజల్ట్ ను పక్కన పెడితే.. దర్శకుడిగా తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్న సినిమా అది. అయితే ఈ సారి ప్రభాస్ తో తీయాలనుకుంటున్న సినిమా కథ విషయంలో మాత్రం పక్కాగా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట.
పూర్తి స్థాయిలో స్ర్కిప్ట్ రాసుకొని త్వరలోనే ప్రభాస్ కు వినిపిద్దామనుకుంటున్నాడట ఏలేటి. ఒక వేళ కథ గానీ ప్రభాస్ కు నచ్చితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకానే ఏలేటి సినిమా చేస్తాడని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి ఏలేటి చంద్రశేఖర్ ప్రభాస్ కోసం ఏ తరహా కథ రాస్తాడో చూడాలి.











