ప్రజల విశ్వనీయతను కొల్పొయిన ఈవీఎంలు..!
భారతదేశంలో జరిగే సాధరణ ఎన్నికల్లో ఈసీ ఈవిఎం లనే ఎక్కవగా వాడుతోంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు( ఈవీఎం) లు అంత నమ్మశక్యంగా కాదని, బ్యాలెట్ పత్రాలతో నిర్వహించే ఎన్నికల్లో విశ్వనీయత ఉంటుందని ప్రజలు, పొలిటికల్ విశ్లేషకులు, మేజారిటీ పార్టీలు భావిస్తున్నాయి. దీనిపై తాజాగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ కామెంట్సే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈవిఎం విశ్వనీయతపై పలు అనుమానాలు ఉన్నాయని, దేశంలో జరిగే ఎన్నికల్లో ఈ యంత్రాలకు బదులు బ్యాలెట్ పత్రాలను వాడాలన్నది ఆయన డిమాండ్ చేశాడు. అంతేకాక దీనిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఆయన లేఖ రాశారు. ఈ డిమాండ్ ను ఆమోదించకపోతే.. తన ఆత్మహత్య చేసుకుని మరణిస్తానని, దానికి మీరు అనుమతివ్వాలని కోరారు.
ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతున్నాయి..!
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం లకు బదులు పాత పద్దతిలోనే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని 2018 లో రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈవీఎంల ట్యాపరింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ఈవీఎంలను సెట్ చేస్తున్నారని, పాత పద్దతిలోనే బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని దేశ వ్యాప్తంగా ఉన్న 17 ప్రముఖ పార్టీలు సీఈసీని కలిసి విన్నవించాయి. ఈ నేపధ్యంలో ఈసీ పార్టీల ఆరోపణలను ఖండించింది! అలా ట్యాపంరింగ్ జరగడం ఆసాధ్యమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓటర్ల జాగృతం చేసే ‘రాష్ట్రీయ మత్దాతా జాగృతి మంచ్’ అధ్యక్షుడిగా ఉంటున్న నందకుమార్ ఈవీఎం విషయంపై మరోకసారి స్పందిస్తూ.. రాష్ట్రపతికి లేఖ రాశారు. పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి, ఈ దేశ పౌరుల్లో భయం పెరుగుతోందని లేఖలో ప్రస్తావించాడు. అందుకే ఈ వ్యవస్థలో నాకు బ్రతకాలని లేదన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం జనవరి 25 న తన ఆత్మహత్యకు అనుతివ్వండని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను లేఖలో వేడుకున్నారు.










