నేటి బాలలే రేపటి పౌరులు . వారే దేశ భవిష్యత్తుకు పునాదులు. వారి భవిష్యత్తును విస్మరిస్తే కలిగే దుష్పరిణామాలను ప్రపంచమంతా ఎప్పుడో గుర్తించింది. అందుకే వారి చదువు, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. 1925 లోనే జెనీవాలో ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే. అప్పటి నుంచి ప్రపంచంలోని చాలా దేశాలు నవంబరు20న బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి.
మన దేశంలో ..
మన దేశంలో కూడ స్వాతంత్ర్యం వచ్చాక 1956 వరకు నవంబరు 20 నే బాలల దినోత్సవం నిర్వహించేవారు. అయితే మన దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన ఎర్ర గులాబీలను ఎంతగా ప్రేమించేవారో అంతగా పిల్లలంటే ఇష్టపడేవారు. అందుకే ఆయన మన దేశ చిన్నారులందరికీ తాత అయ్యారు. చాచా నెహ్రూగా ప్రసిద్ధి కెక్కారు. దీంతో ఆయన దివంగతుడైన 1964 నుంచి ఆయన పుట్టిన రోజైన నవంబరు14 న మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రతి యేటా పాఠశాలల్లో చిన్నారులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనేక ఎన్జీవో సంస్థలు కూడ ఈ తేదీన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా దివ్యాంగులైన చిన్నారులను ప్రోత్సహిస్తూ ఉత్సాహ పరుస్తుంటాయి.
కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాలల్లో కార్యక్రమాలేవీ నిర్వహించలేకపోయినా చిన్నారులకు ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ ఈ రోజే రావడం ఎంతో సంతోషకరం. చిన్నారుల భవిష్యత్తుకు అందరం కట్టుబడి ఉందామని ఈ సందర్భంగా మరోసారి ప్రతిన బూనుదాం.
"పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే. మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది" అన్నారు అబ్రహాం లింకన్. అంటే ప్రస్తుతం మనం మంచి పనులు చేస్తే.. రేపటి సమాజాన్ని కూడా మంచిగా ఉంచే బాధ్యతను పిల్లలు తీసుకుంటారన్నది లింకన్ ఉవాచ. (1/5) pic.twitter.com/CA0XKwcnJQ
— N Chandrababu Naidu (@ncbn) November 14, 2020
చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay2020
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2020











