తలైవా రజనీకాంత్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇంటి ముందుకు వచ్చిన అభిమానులను ఆయన పలకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయ ప్రకటన కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పార్టీని ప్రకటించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
కానీ ఆయన తన ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంట్లో జాగ్రత్త ఉండాలనుకుంటున్నారు. రాజకీయ నిర్ణయాన్ని సస్పెన్స్ లోనే ఉంచారు. సాధారణంగా రజనీ పుట్టినరోజు, పండగ రోజుల్లో రజనీని కలవడానికి అభిమానులు తండోపతండాలుగా ఆయన ఇంటికి వస్తుంటారు. ఈరోజు కూడా పోయస్ గార్డెన్ లోని ఆయన ఇంటికి అభిమానులు వచ్చారు. అలా వచ్చిన అభిమానులను కలవడాన్ని ఓ ఆచారంగా రజిని పెట్టుకున్నారు.
తన ఇంటిముందు గుమికూడిన అభిమానులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మొహానికి మాస్క్ ధరించి బయటికి వచ్చిన రజనీ గేటు వెనుక నిలబడి అభిమానుల వైపు చూస్తూ చేతులు జోడించారు. ఆ తర్వాత అందరినీ చేతులు ఊపి పలకరించారు. మంచి రోజున రజినీని కలిశామన్న ఉత్సాహంతో అభిమానులు సంతృప్తిగా వెళ్లిపోయారు. రజినీ అభిమానులతో కరచాలనం చేస్తున్న ఫోటోలను అభిమానులు తమ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు.











